PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-news5be43817-6af5-47e1-bd1d-692cca985353-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-news5be43817-6af5-47e1-bd1d-692cca985353-415x250-IndiaHerald.jpgవాలెంటీర్ అంటే స్వచ్చందంగా పని చేసే వారని, వారికి వేతనం పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అలా చేయడం వల్ల వాలంటీర్ల సేవలను గుర్తించినట్లు అవుతుందని సి‌ఎం జగన్ తెలిపారు. దీంతో వాలెంటిర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ నేపథ్యంలో స్వచ్చందం గా పని చేసే వారిని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అధిక పనిభారం ఎందుకు మోపుతున్నారని వాలెంటిర్లు ప్రశ్నిస్తున్నారు. స్వచ్చందంగా సేవ చేసే సేవకులం మాత్రమేనా.. ప్రభుత్వ ఉద్యోగులం కాదా..? అgenaral news;amala akkineni;chalam;mithra;jagan;cm;chief minister;job;minister;letter;service;qualification;ycpజగడ్డ : జగనోరు వాలెంటిర్లు ప్రభుత్వ ఉద్యోగులా..సేవకులా !!జగడ్డ : జగనోరు వాలెంటిర్లు ప్రభుత్వ ఉద్యోగులా..సేవకులా !!genaral news;amala akkineni;chalam;mithra;jagan;cm;chief minister;job;minister;letter;service;qualification;ycpFri, 12 Feb 2021 10:07:11 GMT ఆంద్ర ప్రదేశ్ లో సి‌ఎం జగన్ ముఖ్య మంత్రి గా పదవి బాద్యతలు చేపట్టిన తరువాత ప్రతిష్టాత్మకంగా వాలెంటీర్ వ్యవస్థ ను తీసుకు వచ్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలెంటీర్ వ్యవస్థ ను ప్రవేశ పెట్టినట్లు జగనోరు గొప్పలు చెప్పుకున్నారు. రాష్ట్రం లో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతున్న క్రమం లో వాలెంటీర్ వ్యవస్థ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు యువత కు కల్పించి నిరుద్యోగం పై ఉక్కుపాదం మోపుతున్నట్లు జగనోరు బల్లగుద్ది చెప్పారు. అయితే వాలెంటీర్ వ్యవస్థ కార్య రూపం దల్చే కొద్ది అభ్యర్థుల నుండి వ్యతిరేకత నెలకొంది. ఇది "వాలెంటీర్ వ్యవస్థ కాదు వైసీపీ వ్యవస్థ." అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్ళువెత్తాయి.

 అర్హత ఉన్న అభ్యర్థులకు కాకుండా వైసీపీ నాయకులు రికమెండేషన్ చేసిన వారికి మాత్రమే వాలెంటీర్ ఉద్యోగాలు ఇచ్చారంటూ ప్రతిభ వున్న అభ్యర్థులు ప్రభుత్వ వైఖరి పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. అయితే వాలెంటీర్ ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు కూడా ఉద్యోగం పొందిన సంతోషం కరువైంది. జగనోరి ప్రభుత్వం పరిధికి మించిన పనులను వాలెంటీర్ పైనే మోపింధి. దాదాపుగా గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు చేయవలసిన పనులన్నీ కూడా ఒక్క వాలెంటీర్ తోనే చేయిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు చేరవేయడం మాత్రమే వాలెంటీర్ పని అని చెప్పిన ప్రభుత్వం.

 తీర సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత అధిక పని భారం వాలెంటిర్ల పైనే పడుతుందని వాలెంటిర్లు బహిరంగంగానే తమ ఆవేధనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలమంది వాలెంటిర్ ఉద్యోగాన్ని వదిలేసి ఇతర ఉద్యోగాలపై దృష్టి పెట్టారు. కాగా ఉద్యోగం లో ఉన్న వాలెంటిర్లు పని భారం ఎక్కువగా ఉన్నందున కనీస వేతనం పెంచలంటూ రోడెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగనోరు చేసిన స్టేట్మెంట్ ఒక్కసారిగా వాలెంటిర్లను షాక్ గురి అయ్యారు. తాజాగా ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో వాలెంటీర్ వ్యవస్థ గురించి సి‌ఎం జగన్ ప్రస్తావించారు.

 వాలెంటీర్ అంటే స్వచ్చందంగా పని చేసే వారని, వారికి వేతనం పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అలా చేయడం వల్ల వాలంటీర్ల సేవలను గుర్తించినట్లు అవుతుందని సి‌ఎం జగన్ తెలిపారు. దీంతో వాలెంటిర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ నేపథ్యంలో స్వచ్చందం గా పని చేసే వారిని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అధిక పనిభారం ఎందుకు మోపుతున్నారని వాలెంటిర్లు ప్రశ్నిస్తున్నారు. స్వచ్చందంగా సేవ చేసే సేవకులం మాత్రమేనా.. ప్రభుత్వ ఉద్యోగులం కాదా..? అంటూ వాలెంటిర్లు ప్రశ్నిస్తున్నారు. మరి వారి ప్రశ్నకు జగనోరు ఇచ్చే సమాధానం ఏంటో మరి..!


ఈ పాప బతకాలంటే.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ చేయాలి..?

ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?

టీచర్ల వెతలు: వీళ్లు మనుషులు కారా..? వీళ్లకు కుటుంబాలు ఉండవా..?

వకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !

మైత్రీ మూవీ మేకర్స్ లైన్ అప్ చూసి షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>