PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-elections9750db9f-1f52-4067-9762-2a0046a0f48b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-elections9750db9f-1f52-4067-9762-2a0046a0f48b-415x250-IndiaHerald.jpgప్రభుత్వంపై కస్సుబుస్సుమంటున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇప్పుడు కాస్త మెత్తబడ్డారా. ప్రభుత్వంతో స్నేహం కోరుకుంటున్నారా, అధికారులతో సయోధ్యగా మసలుతోంది అందుకేనా..? వీటన్నిటికీ ఔననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే నిమ్మగడ్డలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక తాజాగా చంద్రబాబు ఆయనపై చేసిన ఆరోపణలు కూడా ఎక్కడో తేడా కొడుతోందనే భావనను తెరపైకి వచ్చాయి. అన్నిటికీ మించిన విచిత్రం ఏంటంటే.. నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలే వద్దు అని మొండjagan-nimmagadda-elections;adah sharma;kumaar;jagan;hosta;government;panchayati;allu sneha;mantraజగడ్డ: నిమ్మగడ్డకు జగన్ స్నేహ హస్తం.. ఇదిగో సాక్ష్యం..జగడ్డ: నిమ్మగడ్డకు జగన్ స్నేహ హస్తం.. ఇదిగో సాక్ష్యం..jagan-nimmagadda-elections;adah sharma;kumaar;jagan;hosta;government;panchayati;allu sneha;mantraFri, 12 Feb 2021 07:00:00 GMT
అవును, నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలకు వెళ్లేది లేదని చెప్పారు ఆమధ్య చాలామంది మంత్రులు. అయితే సుప్రీంకోర్టు తీర్పు కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఏకగ్రీవాలు ఎక్కువగా లేకపోయినా.. పోటీలో సానుకూల ఫలితాలే రావడంతో ధైర్యంగా వాయిదా పడిన ఎన్నికలకు కూడా వెళ్దామనుకుంటున్నారు. ఒకేసారి పంచాయతీ ఎన్నికలతోపాటు.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాల్టీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలనుకుంటోంది ప్రభుత్వం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ద్వారా ఓ ప్రతిపాదనను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు పెట్టింది. వరుసగా ఒకేసారి ఈ ఎన్నికలన్నీ పూర్తి చేయడంతో సమయం ఆదా అవుతుందని, ఎన్నికల కోడ్‌ బెడద తగ్గుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ‌దాస్, ఎస్ఈసీ నిమ్మగడ్డతో ప్రస్తావించారట. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తరువాత వెల్లడిస్తానని ఎస్‌ఈసీ అన్నట్లు గా అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఎక్కడినుంచి మొదలు పెడతారో..?
జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాల్టీ ఎన్నికలు నామినేషన్లు, ఏకగ్రీవాల తర్వాత వాయిదా పడ్డాయి. అప్పటికే ఏకగ్రీవాలను తప్పుబట్టిన నిమ్మగడ్డ కొంతమంది అధికారులను బదిలీ చేసి మరీ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు తిరిగి అవే ఎన్నికలు జరపాల్సి ఉంది. అయితే గతంలో తప్పులు జరిగాయని అంటున్న నిమ్మగడ్డ.. కొత్తగా మళ్లీ షెడ్యూల్‌ ప్రకటించి నోటిఫికేషన్‌ ఇస్తారా? ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెడతారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద నిమ్మగడ్డ ఉండగానే ఎన్నికలు జరపాలని అనుకోవడంతోనే, జగన్ ఆయనతో స్నేహం కోరుకుంటున్నారనే విషయం అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 


హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల Vs బ్రాహ్మణి ?

విజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ ఢిల్లీకి వెళ్ళింది దీనికేనా ?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>