MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/cm-kcr6ebe3091-b2d7-45eb-b1a0-121d5419c9e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/cm-kcr6ebe3091-b2d7-45eb-b1a0-121d5419c9e1-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే అనేక ప్రసంగాలలో చాలా చమత్కరంగా మాట్లాడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ప్రగతి భవన్ లో మరోసారి తన ప్రసంగంలో తనకు నచ్చిన ఓ పాట గురించి ప్రస్తావించారాయన.. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. cm kcr;kcr;jeevitha rajaseskhar;pragathi;vijayalakshmi;hyderabad;mini;telangana;sri venkateswara swamy;chief minister;sanskrit;thota chandrasekhar;reddyసీఎం కేసీఆర్ కి ఇష్టమైన పాట ఏంటో తెలుసా..ఇప్పటికే వంద సార్లు విన్నాడట..??సీఎం కేసీఆర్ కి ఇష్టమైన పాట ఏంటో తెలుసా..ఇప్పటికే వంద సార్లు విన్నాడట..??cm kcr;kcr;jeevitha rajaseskhar;pragathi;vijayalakshmi;hyderabad;mini;telangana;sri venkateswara swamy;chief minister;sanskrit;thota chandrasekhar;reddyFri, 12 Feb 2021 20:00:00 GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే అనేక ప్రసంగాలలో చాలా చమత్కరంగా మాట్లాడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ప్రగతి భవన్ లో మరోసారి తన ప్రసంగంలో తనకు నచ్చిన ఓ పాట గురించి ప్రస్తావించారాయన.. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.

 కొత్తగా ఎన్నికైన జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, టిఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటెనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని ముఖ్యమంత్రి హితవు పలికారు. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలి.. వేష, భాషల్లో మార్పులు రావద్దు.
 
అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతీ ఒక్కరిని ఆదరించాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి. చేతనయినంత సాయం చేయాలి. అబద్దాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.'గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది' అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వంద సార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలంటూ పేర్కొన్నారు...!!


సమంత నాభి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటో..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>