PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-chandrababud6e9c38e-b832-48fd-968e-7f941212de8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-chandrababud6e9c38e-b832-48fd-968e-7f941212de8d-415x250-IndiaHerald.jpgఏపీలో పంచాయతీ ఎన్నికలు వాడి వేడిగా సాగుతున్నాయి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయా అని అనుమానం కలిగించేలా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య భీకర స్థాయిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైసిపి నేతలు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి.. తాజాగా కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది. ఆయన తన నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లి ఆ గ్రామంలో బెదిరింపు ధోరణిలో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీకnimmagadda jagan elections;amala akkineni;kumaar;krishna river;jogi ramesh;district;panchayati;village;court;mla;episode;krishna district;ycp;election commission;house;pedana;reddyజగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?nimmagadda jagan elections;amala akkineni;kumaar;krishna river;jogi ramesh;district;panchayati;village;court;mla;episode;krishna district;ycp;election commission;house;pedana;reddyFri, 12 Feb 2021 15:00:00 GMTఏపీలో పంచాయతీ ఎన్నికలు వాడి వేడిగా సాగుతున్నాయి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయా అని అనుమానం కలిగించేలా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య భీకర స్థాయిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైసిపి నేతలు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి.. తాజాగా కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది. ఆయన తన నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లి ఆ గ్రామంలో బెదిరింపు ధోరణిలో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన అందరు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని వైసీపీకి వ్యతిరేకంగా వార్డు మెంబర్ గా పోటీ చేసినా సరే ప్రభుత్వ పథకాలు తీసి వేయించండని ఆయన అక్కడికి వచ్చిన అధికారులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.

 జగన్మోహన్ రెడ్డి అనేక మంచి మంచి పథకాలు అమలు చేస్తుంటే అయినా మన మీద పోటీ చేస్తున్నారు కాబట్టి అలా వ్యతిరేకంగా నామినేషన్ వేసిన అందరి పెన్షన్, కాపు నేస్తం, అమ్మ ఒడి పథకాలు లాంటివి కట్ చేసి పారేస్తాం అంటూ ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ అటు తిరిగి ఇటు తిరిగి ఈసీ దృష్టికి రావడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన మీద కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 13వ తేదీన రెండో విడత ఎన్నికలు ముగిసేవరకు మీడియాతో మాట్లాడవద్దని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సభలో ప్రచారాలు సమావేశాల్లో ప్రసంగించడం, అలాగే ప్రజలతో కూడా మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కృష్ణా జిల్లా ఎస్పీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. 

అయితే నిజానికి ఈ ఆదేశాలు నిన్న రాత్రి జారీ అయ్యాయి. ఈ ఆదేశాలు రేపటి దాకా అమల్లో ఉంటాయి. నిజానికి రెండు రోజులే కాబట్టి సైలెంట్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ పెద్దిరెడ్డి లాగా జోగి రమేష్ కూడా పర్సనల్ గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు వెళ్లి హౌస్ మోషన్ అలాంటివి వేసి ఈరోజు రేపట్లో మళ్లీ ప్రసంగాలు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతం నుంచి చూసిన పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన ప్రతి దానిని ప్రభుత్వం కోర్టులో సవాల్ చేస్తూనే వస్తోంది. కోర్టులో ఎలాంటి తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటానని చెబుతూనే నిమ్మగడ్డ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని కోర్టులో సవాల్ చేస్తూ వస్తోంది. మరి రెండు రోజులు ఉన్న కారణంగా ఈ అంశంలో కూడా కోర్టుకు వెళతారా లేక సైలెంట్ గా ఉంటారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది..




కేసీఆర్ ని తిడితే ఊరుకోను... కేటిఆర్ వార్నింగ్

ఉప్పెన : రివ్యూ

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!

జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>