MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manasa8d33ecc5-2beb-462d-bd69-3f4d7f5a02ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manasa8d33ecc5-2beb-462d-bd69-3f4d7f5a02ed-415x250-IndiaHerald.jpgతెలుగు వారికి షడ్రసోపేతమైన భోజనం చేయడం అలవాటు. అన్నీ అన్నం కంచంలో ఉన్నా కూడా గోంగూర పచ్చడి ఉండాలి. అలాగే ఆవకాయ కూడా కంపల్సరీ. ఇదే విధమైన అభిరుచి అన్ని విషయాల్లోనూ ఉంటుంది. అందుకే మన తెలుగు సినిమాలు కూడా చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. manasa;eesha;eesha rebba;manasa;varanasi;india;bollywood;tollywood;blockbuster hit;girl;fashionపక్కనే భారతీయ అందం...టాలీవుడ్ లుక్కేస్తుందా...?పక్కనే భారతీయ అందం...టాలీవుడ్ లుక్కేస్తుందా...?manasa;eesha;eesha rebba;manasa;varanasi;india;bollywood;tollywood;blockbuster hit;girl;fashionFri, 12 Feb 2021 12:00:00 GMT
ఎక్కడా గ్లామర్ కి లోటు లేకుండా చూసుకుంటారు. కళ్ళు చెదిరే అందగత్తెలను ప్రతీ సినిమాలో కొత్తగా ఫ్రెష్ గా దింపుతూ బ్లాక్ బస్టర్ హిట్ల కోసం చూస్తూంటారు. ఇదిలా ఉంటే ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్లుగా బాలీవుడ్ నుంచి భామలను దిగుమతి చేసుకుంటున్న టాలీవుడ్ కి పక్కనే ఎంతో అందం ఉన్నా కూడా ఎందుకో పట్టదు అన్న విమర్శలు ఉంటాయి. మన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కంటే బాలీవుడ్ భామలు ఏం ఎక్కువ అన్నది  వారే  చెప్పాలి.

మన ధూళిపాళ సోభిత కంటే టాలెంట్ ఎక్కడ ఉందో వెతికి తీసుకురమ్మంటే మాట్లాడరు, ఇవన్నీ ఇలా ఉండగానే మిస్ ఇండియా కూడా పక్కనే వెలిసింది. ఆమె ఎవరో కాదు మానస వారణాసి. ఈ ముద్దు గుమ్మ మిస్ ఇండియా అయింది. అందానికి అందం, చూడ చక్కని రూపంతో ఈ అమ్మడు ఇపుడు సంచలనం అయింది. మరి ఈ అమ్మడు మీద మన టాలీవుడ్ ఏమైనా చూపు చూస్తుందా అంటే డౌటే మరి.

అయితే ఈ అమ్మడు మాత్రం గత ఏడేళ్ళుగా ఫ్యాషన్ రంగం పై మోజు పెంచుకుని మరీ ఈ స్థాయికి చేరింది. ఆమె మిస్ ఇండియాగా అవతరించి తెలుగు వారి ఖ్యాతిని జాతీయంగా చాటింది. మానస ఇంజనీరింగ్ చదివింది. మోడలింగ్ ఫీల్డ్ పట్ల ఆమెకు ఆసక్తి కలగడానికి కుటుంబ సభ్యులే కారణమని అంటోంది. వారి ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నాను అని చెబుతోంది. ఏది ఏమైన తమ తెలిగింటి అమ్మాయి. మన పక్కనే ఉన్న ముద్దు గుమ్మ ఇంతటి కీర్తిని తేవడం అంటే అందరికీ గర్వకారణమే. ఇదే సమయంలో అందం అంటే ఎక్కడో వుదని ఊరకే ఫ్లైట్లు వేసుకుని మరీ వెతికే ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి వారికి అవకాశాలు ఇస్తే తెలుగు అందం విరబూస్తుంది. తెలుగు కూడా బతుకుతుంది అంటున్నారు.




వీధిలో నిలబెట్టి రేషన్ ఇస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే..

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>