Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-vijay-sethupati120b5ca7-597c-4199-9616-4956d56a9fc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-vijay-sethupati120b5ca7-597c-4199-9616-4956d56a9fc7-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి అభిమానులంతా ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే ఈ విలక్షణ నటుడు తనకు వచ్చిన ఎలాంటి పాత్ర అయినా సరే చేయగలడు. తమిళంలో వీడియో జాకీగా చేసిన విజయ్ సేతుపతి అలా అవకాశాలు అందుకుంటూ హీరోగా ఎదిగాడు. హీరో మాత్రమే కాదు విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎలాంటి పాత్ర అయినా చేసేస్తాడు. 96 సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సైరాmakkal-selvan-vijay-sethupati;chiranjeevi;sethu;vijay;vijay sethupathi;sye-raa-narasimha-reddy;telugu;kollywood;tamil;press;husband;saira narasimhareddy;hero;heroine;joseph vijay;96;vaishnav tejమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!makkal-selvan-vijay-sethupati;chiranjeevi;sethu;vijay;vijay sethupathi;sye-raa-narasimha-reddy;telugu;kollywood;tamil;press;husband;saira narasimhareddy;hero;heroine;joseph vijay;96;vaishnav tejFri, 12 Feb 2021 22:19:58 GMTకోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి అభిమానులంతా ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే ఈ విలక్షణ నటుడు తనకు వచ్చిన ఎలాంటి పాత్ర అయినా సరే చేయగలడు. తమిళంలో వీడియో జాకీగా చేసిన విజయ్ సేతుపతి అలా అవకాశాలు అందుకుంటూ హీరోగా ఎదిగాడు. హీరో మాత్రమే కాదు విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎలాంటి పాత్ర అయినా చేసేస్తాడు. 96 సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో నటించి మెప్పించాడు. అయితే ఆ సినిమాలో అతనిది చిన్న పాత్రే అవడంతో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు.

అయితే ఉప్పెన సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి డైరక్టర్ బుచ్చి బాబు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రాయణం పాత్రలో విజయ్ సేతుపతి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తను చెప్పిన కథకు ఓకే చెప్పాడని విజయ్ సేతుపతిని ఓ రేంజ్ లో చూపించాడు బుచ్చి బాబు. ఓపెనింగ్ షాట్ నుండి ఎండింగ్ షాట్ వరకు ఆయన్ని ఎక్కడ తగ్గించలేదు. ఇంకా చెప్పాలంటే హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిలనైనా కొన్ని చోట్ల డల్ గా చూపించాడు కాని విజయ్ సేతుపతి పాత్రకు తగినట్టుగానే అదరగొట్టేలా చూపించాడు.

తెలుగులో తన సినిమాలు రిలీజ్ అవకపోయినా విజయ్ సేతుపతి అంటే తెలుగు ఆడియెన్స్ కు విపరీతమైన క్రేజ్. సేతుపతి నటించిన తమిళ సినిమాలు చూసి ఆయన్ను ఇష్టపడుతున్నారు. ఫైనల్ గా ఉప్పెన సినిమాతో విజయ్ సేతుపతి తన మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. చెప్పాలంటే అంచనాలకు మించి అనిపించేలా రాయణం పాత్ర చేశాడని చెప్పొచ్చు.                                         




ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>