PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-govt-losts-its-faith-in-publicf5f6dc1a-2834-4aa7-a94a-ef3c079b9d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-govt-losts-its-faith-in-publicf5f6dc1a-2834-4aa7-a94a-ef3c079b9d2c-415x250-IndiaHerald.jpgదుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ప్రభుత్వానికి ఉద్యోగులు, నిరుద్యోగుల నుండి ఎదురౌతున్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ నోపథ్యంలోనే పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందింది. ప్రమోషన్ల ప్రక్రియను సైతం ప్రారంభించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి ఆయా వర్గాలను తమ వైపుకు తిప్పుకోవాలని ప్రభుత్వం భావించింది.trs govt losts its faith in public;amala akkineni;nagarjuna akkineni;hyderabad;telangana rashtra samithi trs;telangana;government;history;tiger;letter;central government;marchఅటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగులకు భారీ షాక్! సాగర్ ఉప ఎన్నికతో “తెరాస ఖేల్ ఖతం”?అటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగులకు భారీ షాక్! సాగర్ ఉప ఎన్నికతో “తెరాస ఖేల్ ఖతం”?trs govt losts its faith in public;amala akkineni;nagarjuna akkineni;hyderabad;telangana rashtra samithi trs;telangana;government;history;tiger;letter;central government;marchFri, 12 Feb 2021 14:30:00 GMTకేంద్ర ఎన్నికల సంఘం,  పట్టభద్రుల విధాన పరిషత్ ఎన్నికల - నోటిఫికేషన్ ను నిన్ననే (11.02.2021)  విడుదల చేసింది. దీంతో తెలంగాణలో “ఎన్నికల కోడ్” అమలులోకి రావడం అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగుల “జీత భత్యాల సవరణ” (పీఆర్సీ) పై ప్రకటనచేసే అవకాశం ప్రస్తుతానికి కోల్పోయింది.  ఇప్పటికే పీఆర్సీ ప్రకటన తీవ్రజాప్యం, అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు ప్రదర్శితమౌతున్నాయి. తీవ్ర నిరాశ వారి నుండి వ్యక్తమవుతుంది.


మార్చి 17న ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. అప్పటి వరకు ‘ఎన్నికల కోడ్’ అమలులో ఉంటుంది. దీంతో ఉద్యోగులు దాదాపు నెలకు పైగా వేతన సవరణ ప్రకటన కోసం నిరీక్షించాల్సిన అగత్యం ఏర్పడింది.


ఇంతలో పిడుగు లాంటి మరో వార్త - నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక కు సైతం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నోముల నర్సింహయ్య మృతితో  ఖాళీ అయిన శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.


రెండు పట్టభద్రుల విధాన మండలి (ఎంఎల్సి) స్థానాలకు ఎన్నికలు - ముగిసే నాటికి ఆ నోటిఫికేషన్ కూడా విడుదలైతే ఇంకొన్ని రోజులు రాష్ట్రంలో ‘ఎన్నికల కోడ్’ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే పీఆర్సీ ప్రకటనలో తీవ్రజాప్యం జరిగే లాగుంది. ఇప్పటికే ఉద్యోగులు ఒకవైపు, నిరుద్యోగులు మరోవైపు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారు.


ప్రభుత్వ కాలయాపన కారణంగానే ఈ సమస్య తలెత్తిందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాదు ఎన్నికలైన తరవాత “ఏరు దాటాక తెప్ప తగలేసే ప్రభుత్వ తీరు”  ఉద్యోగుల్లో అనుమానాలకు తావిస్తుంది. నాయనా పులి వచ్చె అనే పిల్లాడి అబద్ధాల తీరు తెరాస ప్రభుత్వానికి ఉంది.


రాష్ట్రంలో ఏభై వేల ఖాళీలను భర్తీ చేస్తామని కొద్ది కాలం క్రితం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధమవటం ప్రారంభించారు. లక్షలాది మంది కోచింగ్ కోసం హైదరాబాద్ చేరుకుంటున్నారు. శాఖల వారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతాయని వార్తలు వస్తున్న సమయంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం ఈ సమయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆపై సాగర్ ఉప ఎన్నిక. దీంతో నిరుద్యోగుల్లోనూ తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.


దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ప్రభుత్వానికి ఉద్యోగులు, నిరుద్యోగుల నుండి ఎదురౌతున్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ,  ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ నోపథ్యంలోనే పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందింది. ప్రమోషన్ల ప్రక్రియను సైతం ప్రారంభించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి ఆయా వర్గాలను తమ వైపుకు తిప్పుకోవాలని ప్రభుత్వం భావించింది.


ఈ లోగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రభుత్వానికి సైతం ఇబ్బందిగా మారింది. భారీగా ఉద్యోగాను భర్తీ చేస్తామని చేసిన ప్రకటన అనంతరం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడం, పీఆర్సీ ప్రకటించక ముందే గ్రాడ్యుయేట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో “టీఆర్ఎస్ వర్గాల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక” లా మారి ఆందోళన వ్యక్తమవుతోంది.


దీని ప్రభావం  గ్రాడ్యుయేట్ ఎన్నికలపై చూపే అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల తరవాత వరద సాయం లోపాలను సవరించి వారికి ఆర్ధిక సాయం చేస్తామన్న టీఆరెస్ ప్రభుత్వం ఎన్నికలయ్యాక పట్టించుకోవటం మానేసింది. ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. తెరాస ప్రభుత్వం బాధితులకు గాని,  ప్రజలలో ఏ వార్గానికైనా గాని, ఎన్నికలప్పుడే తప్ప మేలు చేసే అవకాశం ఉండదని చరిత్ర చెపుతుంది.


ప్రస్తుతం ప్రజల్లో ఏ వర్గం కూడా తెరాస ప్రభుత్వం, దాని నాయకత్వం చేసే వాగ్ధానాలను, నమ్మే పరిస్థితులు లేవు. సాగర్ ఎన్నికతో తెలంగాణాలొ “తెరాస ఖేల్ ఖతం” అంటున్నారు.
 


గుడ్డు ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!

జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>