ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/parlament62ab80a8-0f8a-4a3a-a13d-bd1a3309526c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/parlament62ab80a8-0f8a-4a3a-a13d-bd1a3309526c-415x250-IndiaHerald.jpgఎస్సీ, ఎస్టీలు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ సౌకర్యాలు కోల్పోతారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.దేశంలో ఇటీవలే మతమార్పిడులు పెద్ద సంఖ్యలో జరుగుతుండటం తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయింది. parliament;tara;bharatiya janata party;mohandas karamchand gandhi;mp;scheduled caste;parliment;assembly;minister;central governmentమతం మారితే... రిజర్వేషన్లు కోల్పోతారు - కేంద్ర ప్రభుత్వంమతం మారితే... రిజర్వేషన్లు కోల్పోతారు - కేంద్ర ప్రభుత్వంparliament;tara;bharatiya janata party;mohandas karamchand gandhi;mp;scheduled caste;parliment;assembly;minister;central governmentFri, 12 Feb 2021 17:00:00 GMTమనదేశంలో రిజర్వేషన్లు అనే అంశం చాలా సున్నితమైన అంశం. ఈ విషయమై ఎవరైనా తమకు తోచిన విధంగా ఎలా పడితే అలా మాట్లాడితే సంబంధిత వర్గాల వారి నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలు గతంలో అనుభవమే. కావున ఈ రిజర్వేషన్ల అంశంపై ప్రజా ప్రతినిధులు సైతం ఆచితూచి వ్యవహరించాల్సిన విషయం. అయితే దేశంలో ఇటీవలే మతమార్పిడులు పెద్ద సంఖ్యలో జరుగుతుండటం తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయింది. మరీ ముఖ్యంగా రిజర్వేషన్లు పొందే వర్గాల్లో ఇవి కొంచెం అధికంగా ఉంటున్నాయనే వార్తలు ఇటీవలే వెలుగులోకి రావడంతో... మతం మారిన దళితులకు రిజర్వేషన్లు అంశంపై కేంద్రం పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేసింది. దళితులు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు కోల్పోతారని గురువారం పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చింది.




 ఎస్సీ, ఎస్టీలు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ సౌకర్యాలు కోల్పోతారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీల జాబితాలోని చాలా మంది మతం మారినప్పటికీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసి, పదవులు అనుభవిస్తున్నారు.. అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ చేసే ఆలోచన ఉందా? అని జీవీఎల్‌ ప్రశ్నించారు. దీనికి మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదనేదీ లేదని అన్నారు. అయితే నామినేషన్ల సమయంలోనే వారు మతం మార్చుకున్నట్టు రిటర్నింగ్‌ అధికారులకు సాక్ష్యాలతో ధ్రువీకరిస్తే వారి నామినేష్లను తిరస్కరించవచ్చని చెప్పారు.

ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మారిన దళితులు పార్లమెంట్ లేదా అసెంబ్లీ రిజర్వ్‌డ్ స్థానాల నుంచి పోటీచేయడానికి అనర్హులు.. అలాగే, రాజ్యాంగం కల్పించిన ఇతర రిజర్వేషన్ ప్రయోజనాలు అందుకోలేరు అని కేంద్ర మంత్రి తెలిపారు. ‘రాజ్యాంగంలోని 3 వ పేరా (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ ఇలా పేర్కొంది... 




హిందూ, సిక్కు, బౌద్ధ మతానికి భిన్నమైన మతాన్ని అనుసరించే ఏ వ్యక్తీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యుడిగా పరిగణించరు’ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రకటన హిందూ, సిక్కు లేదా బౌద్ధమతాన్ని స్వీకరించడానికి ఎంచుకున్న వారితో ఇస్లాం, క్రైస్తవాన్ని స్వీకరించే దళితుల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతుంది. స్వాతంత్రానికి ముందు రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో అణగారిన వర్గాల వారికి రాజకీయ హక్కులు లభించాలంటే వాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ డిమాండ్ చేశారు. కానీ గాంధీజీ అందుకు అంగీకరించకుండా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. చివరికి, అంబేడ్కర్ రాజీ పడి రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు అంగీకరించారని చెబుతారు.




"ఉప్పెన సినిమాను విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా.. కానీ ఏం జరిగిందంటే"..సంచలన విషయాలు వెల్లడించిన బుచ్చిబాబు..!!

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>