PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/araku-bus-accident823c177a-0376-4b25-98ea-afc2773767e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/araku-bus-accident823c177a-0376-4b25-98ea-afc2773767e8-415x250-IndiaHerald.jpgవిశాఖ జిల్లా అరకు లోయలో ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్‌ ఐదో నంబరు మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. పలువురి టూరిస్టులకు గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు. araku bus accident;pawan;kalyan;pawan kalyan;tiru;hyderabad;andhra pradesh;telangana;janasena;district;avanthi srinivas;vishakapatnam;police;bus;minister;fort;janasena party;araku valley;kavuru srinivasఅరకు లోయలో పడ్డ బస్సు.. 8మంది మృతిఅరకు లోయలో పడ్డ బస్సు.. 8మంది మృతిaraku bus accident;pawan;kalyan;pawan kalyan;tiru;hyderabad;andhra pradesh;telangana;janasena;district;avanthi srinivas;vishakapatnam;police;bus;minister;fort;janasena party;araku valley;kavuru srinivasFri, 12 Feb 2021 21:38:28 GMTవిశాఖ జిల్లా అరకు లోయలో  ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్‌ ఐదో నంబరు మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. పలువురి టూరిస్టులకు గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు.

   అరకునుంచి హైదరాబాద్‌ తిరిగివెళుతుండగా ప్రమాదం జరిగింది. బస్సు దూసుకెళ్లిన ప్రాంతంలో చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డుముకు దాటిన తర్వాత మలుపు వద్ద బస్సు లోయలో పడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్‌ షేక్‌పేటకు చెందిన దినేష్ ట్రావెల్స్‌‌దిగా గుర్తించారు

 అరకు లోయ ప్రమాదం  ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ విజయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అరకు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  హైదరాబాద్ నుంచి అరకు పర్యటనకు వెళ్ళినవారు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురికావడం విషాదకరం.. 30 మందితో ఉన్న బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది మృత్యువాత పడ్డారని తెలిసింది.. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు తగిన పరిహారం ఇవ్వాలి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులైన పర్యాటకులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకొని మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి’ అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. 


రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా సెట్ అయ్యిందో తెలుసా..?

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>