SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/ipl-2021-hungama-begins-are-the-players-participating-in-the-auction489a2a0e-9429-4734-8c37-9e0324b0afcf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/ipl-2021-hungama-begins-are-the-players-participating-in-the-auction489a2a0e-9429-4734-8c37-9e0324b0afcf-415x250-IndiaHerald.jpgక్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు అంతా సిద్దమౌతుంది. ఈ నెల 18 న చెన్నై లో ఆటగాళ్ల ఎంపిక కోసం మినీ వేలం నిర్వహించనున్నారు. అందుకోసం వేలం లో పాల్గొనే ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇది వరకే బి‌సి‌సి‌ఐ ప్రకటించింది. దాంతో ఐ‌పి‌ఎల్ లో ఆడేందుకు 1,114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఇందులో 292 మందిని షార్ట్ లిస్ట్ చేసి చేసింది. షార్ట్ లిస్ట్ లో పేరు ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఈ నెల 18న జరిగే వేలం లో పాల్గొననున్నారు. తాజాగా వారి జాబితాను బి‌సి‌సి‌ఐ విడుదల చేసింది. వsports news;koti;ali;sam;samantha;cricket;mini;harbhajan singh;chennai;letter;sreesanth;indian;sam mendesఐ‌పి‌ఎల్ 2021 హంగామా షురూ..వేలంలో పాల్గొనే ఆటగాళ్లు వీళ్ళే ..!!ఐ‌పి‌ఎల్ 2021 హంగామా షురూ..వేలంలో పాల్గొనే ఆటగాళ్లు వీళ్ళే ..!!sports news;koti;ali;sam;samantha;cricket;mini;harbhajan singh;chennai;letter;sreesanth;indian;sam mendesFri, 12 Feb 2021 17:01:00 GMTక్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు అంతా సిద్దమౌతుంది. ఈ నెల 18 న చెన్నై లో ఆటగాళ్ల ఎంపిక కోసం మినీ వేలం నిర్వహించనున్నారు. అందుకోసం వేలం లో పాల్గొనే ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇది వరకే బి‌సి‌సి‌ఐ ప్రకటించింది. దాంతో ఐ‌పి‌ఎల్ లో ఆడేందుకు  1,114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఇందులో 292 మందిని షార్ట్ లిస్ట్ చేసి చేసింది. షార్ట్ లిస్ట్ లో పేరు ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఈ నెల 18న జరిగే వేలం లో పాల్గొననున్నారు. తాజాగా వారి జాబితాను బి‌సి‌సి‌ఐ విడుదల చేసింది. వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.

 రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో కేవలం ఇద్దరే ఇద్దరు దేశీ ఆటగాళ్లకు చోటు లభించగా.. ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. దేశీయ ఆటగాళ్లలో  హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్‌ను 2కోట్ల జాబితాలో చేర్చారు. అలాగే మరో ఎనిమిది విదేశీ క్రికెటర్లను సైతం రూ.2కోట్ల బేస్‌ప్రైస్‌ జాబితాలో చేర్చారు. ఇందులో గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ ఉన్నారు. ఇదిలా వుంటే.. రూ.1.5 బేస్‌ప్రైజ్‌ కేటగిరిలో 12 మందిని, రూ.కోటి కేటగిరిలో హనుమ విహారి, ఉమేశ్‌యాదవ్ ఆటగాళ్లు స్థానం సంపాధించుకోగా వీరితో పాటుగా‌ 11 మందిని చేర్చారు. 

అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కులర్‌ తనయుడు అర్జున్‌కు సైతం వేలంలో చోటు కల్పించారు. అయితే టీమిండియా మాజీ ఫెసర్ శ్రీశాంత్ కు మాత్రం నిరాశ తప్పలేదు. ఐ‌పి‌ఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్నప్పటికి, షార్ట్ లిస్ట్ లో చోటు దక్కలేదు. దీంతో శ్రీశాంత్ ఈ ఏడాది ఐ‌పి‌ఎల్ ఆడే అవకాశం లేదు. కాగా ఈ ఏడాది ఐ‌పి‌ఎల్ స్పాన్సర్ షిప్ మళ్ళీ చైనా దిగ్గజ సంస్థ వివో నే దక్కించుకుంది.


"ఉప్పెన సినిమాను విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా.. కానీ ఏం జరిగిందంటే"..సంచలన విషయాలు వెల్లడించిన బుచ్చిబాబు..!!

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>