PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/killed8e19c60f-271d-4cff-8c67-9bef7a060afc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/killed8e19c60f-271d-4cff-8c67-9bef7a060afc-415x250-IndiaHerald.jpgసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్న కారణాలకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలను తీసేస్తున్నారు. అలాంటి కోణంలో మరో ఘటన చోటు చేసుకుంది. ఆ మోడల్ చాలా అందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటీ క్వీన్. ఇంతటి అందాల రాశిని వారు ఊరుకుంటరా. మోడల్ ఏజెన్సీలు, ఇండస్ట్రీ ప్రముఖలు పిలిచి మరి అవకాశాలు ఇచ్చారు. తన కంటూ ఓ గుర్తింపు లభించింది. మోడల్ గా ఎదుగుతున్న సమయంలోనే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు.killed;beauty;jeevitha rajaseskhar;nithya new;rani;turkey;patti;lebanon;police;marriage;industry;audio;husband;murder.;queenదారుణం: బ్యూటీ క్వీన్‌ గొంతు కోసి హత్య చేసిన భర్త.. ఎందుకంటే..!?దారుణం: బ్యూటీ క్వీన్‌ గొంతు కోసి హత్య చేసిన భర్త.. ఎందుకంటే..!?killed;beauty;jeevitha rajaseskhar;nithya new;rani;turkey;patti;lebanon;police;marriage;industry;audio;husband;murder.;queenFri, 12 Feb 2021 07:00:00 GMT బ్యూటీ క్వీన్. ఇంతటి అందాల రాశిని వారు ఊరుకుంటరా. మోడల్ ఏజెన్సీలు, ఇండస్ట్రీ ప్రముఖలు పిలిచి మరి అవకాశాలు ఇచ్చారు. తన కంటూ ఓ గుర్తింపు లభించింది. మోడల్ గా ఎదుగుతున్న సమయంలోనే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. వివాహం అయ్యి ఏడాది కూడా గడవలేదు. భార్యను దారుణంగా చంపాడు. ఈ ఘటన లెబనాన్ లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లెబనాన్‌కు చెందిన జైనా కంజో చాలా అందంగా ఉంటుంది. బ్యూటీ క్వీన్‌. మోడల్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. వివాహం అయ్యి ఇంకా ఏడాది కూడా గడవలేదు. అన్యోన్యంగా సాగాల్సిన వారి జీవితంలో ఘర్షణలు మొదలయ్యాయి. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి.. మోడల్‌గా రాణించాలనేది జైనా ఆశ. కానీ ఆమె భర్త ఆలోచన వేరు. అందరి భార్యల్లాగే జైనా కూడా ఇంటి పట్టునే ఉండాలనుకున్నాడు. కుటుంబాన్ని చూసుకోవాలని భావించాడు.

ఇక దీంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలే. ఇక లాభం లేదునుకుని జైనా భర్త నుంచి విడిపోవాలని భావించింది. కానీ విడాకులు తీసుకోవడం భర్తకు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఈ నెల 7వ తారీఖున ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఆగ్రహంతో ఊగిపోయిన జైనా భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వత భయంతో అక్కడి నుంచి టర్కీ పారిపోయాడు. జైనాను హత్య చేసిన తర్వాత ఆమె భర్త తాను చేసిన దారుణం గురించి సోదరితో చెప్పాడు. వారి మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌‌ మీడియాకు చిక్కింది. దీని ఆధారంగా పోలీసులు జైనా భర్త మీద కేసు నమోదు చేశారు.

ఇక ఈ ఆడియో క్లిప్పింగ్‌లో జైనా భర్త తన సోదరిని ఉద్దేశించి.. "నన్ను ఏమైనా అడుగు. నేను కావాలని తనను చంపలేదు. ఆమె చనిపోవాలని నేను కోరుకోలేదు. ఆమె ఏడుస్తుండటంతో నా చేతిని ఆమె నోటికి అడ్డం పెట్టాను. ఏడవద్దని చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు.. నాతో గొడవపడాలని చూసింది. తెల్లవారుతున్నా ఆమె ఏడుపు ఆపలేదు. నేను ఆమెను చంపానా" అని విచారణలో తేలింది..


హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల Vs బ్రాహ్మణి ?

విజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ ఢిల్లీకి వెళ్ళింది దీనికేనా ?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>