PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/sec-hero-in-tdp-chandrababu-zero-that-is-the-twistfc4815f0-8f54-4cba-bd17-a19988c3807e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/sec-hero-in-tdp-chandrababu-zero-that-is-the-twistfc4815f0-8f54-4cba-bd17-a19988c3807e-415x250-IndiaHerald.jpgఅడ్డగోలుగా నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని అన్నారు. ఏపీలో దుస్థితిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రికి కూడా వివరాలు పంపుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారులు.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని, చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎస్‌ఈసీదే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అన్నీ తానే అయిన ఎస్ ఈసీపైనే ఇలా చంద్ర‌బాబువిమర్శ‌లు nimmagadda chandra babu;cbn;mithra;high court;media;court;hero;letter;tdp;central government;election commission;zero;partyటీడీపీలో ఎస్ఈసీ హీరో.. చంద్ర‌బాబు జీరో... అదే ట్విస్ట్ ?టీడీపీలో ఎస్ఈసీ హీరో.. చంద్ర‌బాబు జీరో... అదే ట్విస్ట్ ?nimmagadda chandra babu;cbn;mithra;high court;media;court;hero;letter;tdp;central government;election commission;zero;partyFri, 12 Feb 2021 13:35:00 GMTటీడీపీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న కామెంట్లు.. టీడీపీ నేత‌ల్లో ఆత్మ స్థ‌యిర్యం పెంచ‌క‌పోగా.. మొత్తానికే చేటు తెస్తాయ‌ని అంటున్నారు సీనియ‌ర్లు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌ను మోసిన టీడీపీ .. ఇప్పుడు ఒక్క‌సారిగా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఆయ‌న‌పై ఏకంగా చంద్ర‌బాబు తీవ్ర‌కామెంట్లు చేశారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్‌ఈసీ విఫలమైందని విమర్శించారు. ఎస్‌ఈసీ తన అధికారాలు పూర్తిగా ఉపయోగించలేదని తప్పుబట్టారు. ఎస్‌ఈసీ విఫలమవడం వల్లే హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ మద్దతుదారులపైనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. అడ్డగోలుగా నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని అన్నారు.  ఏపీలో దుస్థితిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రికి కూడా వివరాలు పంపుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారులు.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని, చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎస్‌ఈసీదే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అన్నీ తానే అయిన ఎస్ ఈసీపైనే ఇలా చంద్ర‌బాబువిమర్శ‌లు చేయ‌డాన్ని పార్టీ నేత‌లు త‌ప్పుప‌డుతున్నారు. ``ఇప్ప‌టి వ‌ర‌కు మాకు అంతో ఇంతో సాయం ఎస్ ఈసీద్వారానే వ‌స్తోంది. ఇప్పుడు మా నాయ‌కుడు ఏకంగా ఆయ‌న‌పైనే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటున్నారు. అదే స‌మ‌యంలో కేంద్రానికి కూడా ఫిర్యాదులు మోస్తాన‌ని చెబుతున్నారు.

ఇక‌, కోర్టులోనూ కేసులు వేస్తున్నారు. ఇది ఎస్ ఈసీని ఇబ్బంది పెట్ట‌డం కింద‌కే వ‌స్తుంది. ఇలా అయితే.. జ‌ర‌గ‌బోయే మూడు విడ‌త‌ల ఎన్నిక‌ల్లో ఎస్ ఈసీ త‌ప్పుకొంటే.. మా ప‌రిస్థితి మ‌రింత దారుణం`` అని విజ‌య‌వాడ‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు ఆఫ్ దిరికార్డుగా మీడియా మిత్రుల‌కు చెప్ప‌డంసంచ‌ల‌నంగా మారింది. దీనిని బ‌ట్టే టీడీపీ వాళ్ల‌కు బాబుపై న‌మ్మ‌కం పోయిందని తెలుస్తోంది. మ‌రి చంద్ర‌బాబు వెన‌క్కి త‌గ్గుతారో.. ముందుకు సాగుతారో చూడాలి.




జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>