MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-bb3e2974dc6-cf55-4663-ab9a-d483f96e9512-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-bb3e2974dc6-cf55-4663-ab9a-d483f96e9512-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...!! ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయాలంటే పెద్ద తలనొప్పిగా మారింది దర్శకులకు.. ముఖ్యంగా మన బాలయ్య సినిమా అంటే బాబోయ్ అంటూ దూరం పెట్టేస్తున్నారు హీరోయిన్స్. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఆయన సీనియర్ హీరో అయ్యిపోవటం ప్రధాన కారణం.బాలయ్య,చిరంజీవి వంటి హీరోలతో చేస్తే తర్వాత యంగ్ హీరోలు దూరం పెట్టేస్తారని ఓ భయం. అంతేకాదు బాలయ్య సినిమా అంటే కాస్త బడ్జెట్ కంట్రోలులో ఉంటుంది. balayya bb3;chiranjeevi;balakrishna;boyapati srinu;india;cinema;hero;heroine;kick'BB3' లో ఐటమ్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న బోయపాటి..!!'BB3' లో ఐటమ్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న బోయపాటి..!!balayya bb3;chiranjeevi;balakrishna;boyapati srinu;india;cinema;hero;heroine;kickFri, 12 Feb 2021 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...!!
 ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయాలంటే పెద్ద తలనొప్పిగా మారింది దర్శకులకు.. ముఖ్యంగా మన  బాలయ్య సినిమా అంటే బాబోయ్ అంటూ దూరం పెట్టేస్తున్నారు హీరోయిన్స్. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఆయన సీనియర్ హీరో అయ్యిపోవటం ప్రధాన కారణం.బాలయ్య,చిరంజీవి వంటి హీరోలతో చేస్తే తర్వాత యంగ్ హీరోలు దూరం పెట్టేస్తారని ఓ భయం. అంతేకాదు బాలయ్య సినిమా అంటే కాస్త బడ్జెట్ కంట్రోలులో ఉంటుంది.
 
రెమ్యునేషన్స్ ఎక్కువ డిమాండ్ చేసుకోవటానికి ఉండదు. అలాగే టైమ్ అంటే టైమే. చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఇవన్ని ఇండస్ట్రీలో చెప్పుకునే మాటలు.ఇవన్ని వినే హీరోయిన్స్ ముందే మనకెందుకులే అని సైడ్ అయ్యిపోతున్నారు. దాంతో ప్రతీ సారి హీరోయిన్స్ సమస్య వచ్చేస్తోంది బాలయ్యకు.ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. సరైన హీరోయిన్ సెట్ కాకపోవటంతో పూర్ణలాంటి స్టార్ డమ్ లేని హీరోయిన్ తో ముందుకు వెళ్తున్నాడు. అయితే బోయపాటి సినిమాలో ఐటమ్ సాంగ్స్ కు ప్రత్యేకమైన స్దానం ఉంది. తనకున్న పరిచయాలతో స్టార్ హీరోయిన్స్ అడుగుతున్నారట బోయపాటి. అయితే ఎవ్వరూ ఇప్పటిదాకా సెట్ కాలేదంటున్నారు.

హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయిస్తే వచ్చే కిక్ వేరు అని నిర్మాతతో భారీగా రెమ్యునేషన్ ఇప్పించి చేద్దామనుకున్నా హీరోయిన్స్ ..తమ కాల్షీట్స్ ఖాళీగా లేవని గౌరవంగా తప్పుకోవటంతో ఏం చేయాలో అర్దం కాక బోయపాటి తలపట్టుకుంటున్నాడట. మే లో రిలీజ్ అనుకుంటున్నారు. ఇంటే మినిమం ఏప్రియల్ కు షూటింగ్ పూర్తవ్వాలి. ఇప్పటికే కరోనాతో బాగా లేటైపోయింది. దాంతో ఇంక హీరోయిన్స్ ఐటం సాంగ్స్ కు దొరక్కపోతే హాట్ గా ఉండే ఓ కొత్తమ్మాయితో లాగేద్దమని ఫిక్స్ అయ్యాడట.ఇక బిబి3 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వినపడుతోంది...!!






కేసీఆర్ ని తిడితే ఊరుకోను... కేటిఆర్ వార్నింగ్

ఉప్పెన : రివ్యూ

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!

జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>