Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/state-govt-new-decision-on-ration-cardsab2fd0ff-59ee-434b-8dbe-a35c40ab0fe4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/state-govt-new-decision-on-ration-cardsab2fd0ff-59ee-434b-8dbe-a35c40ab0fe4-415x250-IndiaHerald.jpgఅర్హులైన పేద కుటుంబాలు అందరికీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డుల ల కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎన్నో రోజుల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో సామాన్య ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అనుమతులు రాకపోవడంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మration;kcr;telangana;chief minister;qualificationకొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే.. నిరీక్షణ తప్పేలా లేదు..?కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే.. నిరీక్షణ తప్పేలా లేదు..?ration;kcr;telangana;chief minister;qualificationFri, 12 Feb 2021 08:20:00 GMTతెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎన్నో రోజుల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో సామాన్య ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు.  అయితే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అనుమతులు రాకపోవడంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మాత్రం నిలిచిపోయింది. దీంతో ఎంతో మంది ప్రజలు  అర్హత ఉన్నప్పటికీ రేషన్ సరుకులు పొంద లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



 అయితే ఇటీవలే కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సామాన్య ప్రజలు అందరికీ కూడా శుభ వార్త చెప్పింది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అందజేస్తాము అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇక ఈ క్రమంలోనే కెసిఆర్ ఈ ప్రకటన చేసినప్పటికీ ఎప్పుడు కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభిస్తుందా అనేది అందరూ ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే లక్షల మంది కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకుని ఉండగా ఇక ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే ఆలస్యం గా మారిపోయింది.


 ఇకపోతే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తోంది.
 ఎందుకంటే బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏకంగా ఎనిమిది లక్షలకు పైగా బోగస్ కార్డులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ఈ బోగస్ రేషన్ కార్డులను  తొలగించిన తర్వాతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన జారీ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. అయితే దీని పై సమీక్ష నిర్వహించి త్వరలోనే విధివిధానాలను అధికారులు రూపొందించనున్నట్లు  తెలుస్తుంది.


జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?

జగడ్డ: నిమ్మగడ్డకు జగన్ స్నేహ హస్తం.. ఇదిగో సాక్ష్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>