PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/dines-trivedif40e1304-5230-4a93-82f1-63424cd64df6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/dines-trivedif40e1304-5230-4a93-82f1-63424cd64df6-415x250-IndiaHerald.jpgపెద్దల సభ రాజ్యసభలో విపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒకరు అందరికీ షాక్ ఇచ్చారు. సభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించటమే కాకుండా తాను ఇక ఎంతమాత్రం పదవిలో కొనసాగలేనని పేర్కొనడం, అలాగే ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సభ్యులందరికీ షాక్ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ దినేశ్ త్రివేది శుక్రవారం (ఫిబ్రవరి 12) పెద్దల సభలో మాట్లాడుతూ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.dines trivedi;bharatiya janata party;west bengal - kolkata;congress;rajya sabha;mp;రాజీనామా;prime minister;february;party;narendraపెద్దల సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ....పెద్దల సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ....dines trivedi;bharatiya janata party;west bengal - kolkata;congress;rajya sabha;mp;రాజీనామా;prime minister;february;party;narendraFri, 12 Feb 2021 23:00:00 GMTపెద్దల సభ రాజ్యసభలో విపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒకరు అందరికీ షాక్ ఇచ్చారు. సభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించటమే కాకుండా తాను ఇక ఎంతమాత్రం పదవిలో కొనసాగలేనని పేర్కొనడం, అలాగే ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సభ్యులందరికీ షాక్ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ దినేశ్ త్రివేది శుక్రవారం (ఫిబ్రవరి 12) పెద్దల సభలో మాట్లాడుతూ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. సభలో మాట్లాడుతున్నంతసేపు చాలా భావోద్వేగంగా కనిపించారు దినేశ్ త్రివేది.




 ‘ పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింసను ఆపలేకపోతున్నా. ఇది నన్ను ఊపిరి తీసుకోనివ్వట్లేదు. చాలా బాధగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా..’ అని దినేశ్ త్రివేది అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనను పెద్దల సభకు పంపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆయన కృత‌జ్ఞతలు తెలిపారు. ఇక తాను సభలో మాట్లాడుతూ... ‘నేను చచ్చిపోతున్నా (ఊపిరి తీసుకోలేకపోతున్నా).. రాష్ట్రంలో హింసను ఆపడానికి నేను ఏం చేయలేకపోతున్నా. నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తోంది. నువ్వు ఇక్కడ కూర్చొని ఏమీ చేయలేకపోతే.. వెంటనే రాజీనామా చేయమని చెబుతోంది’ అని దినేశ్ త్రివేది అన్నారు.




స్వామి వివేకానంద మాటలను త్రివేది గుర్తుచేశారు. ‘లేవండి, మేల్కొండి, గమ్యం చేరేంతవరకు విశ్రమించకండి..’ అని వివేకానంద చెప్పారని పేర్కొన్నారు. రాజీనామా చేసినా పశ్చిమ బెంగాల్ ప్రజల సేవలోనే ఉంటానని త్రివేది చెప్పారు. ఆయన బీజేపీ పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు వివిధ అంశాలపై ప్రసంగించిన త్రివేది ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. కరోనా సంక్షోభ సమయంలో చాలా బాగా పనిచేశారని.. దేశాన్ని సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు. మరోవైపు.. రాజీనామా చేసేందుకు నియమిత పద్ధతి ఉంటుందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. సరైన పద్ధతిలో రాజీనామా లేఖను సమర్పించాలని దినేశ్ త్రివేదికి సూచించారు.




జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఒకవైపు.. అవినాష్ ఒకవైపు అయినా టి.ఆర్.పి అదరగొట్టాడు..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>