MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poori-ravi4698435a-3f2f-4906-bbce-e00be3a588e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poori-ravi4698435a-3f2f-4906-bbce-e00be3a588e3-415x250-IndiaHerald.jpgకొన్ని కాంబినేషన్లను ఊహించుకుంటేనే ఫుల్ ఎనర్జీ వస్తుంది. టాలీవుడ్ లో అలాంటి జంటలు కొన్ని ఉంటాయి. అవి హై ఓల్టేజ్ కాంబోలు. టచ్ చేస్తే బ్లాక్ బస్టరే మరి. ఇక తెలుగు సినిమాను కొత్త పంధాలో నడిపించడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా తమ ప్రయత్నాలు చేశారు. poori ravi;ravi;shankar;hosta;tollywood;cinema;audience;ismart shankar;blockbuster hit;comedy;hero;josh;massఇద్దరూ ఫామ్ లో ఉన్నారు..... ఇక బ్లాక్ బస్టరే...?ఇద్దరూ ఫామ్ లో ఉన్నారు..... ఇక బ్లాక్ బస్టరే...?poori ravi;ravi;shankar;hosta;tollywood;cinema;audience;ismart shankar;blockbuster hit;comedy;hero;josh;massFri, 12 Feb 2021 20:30:00 GMTటాలీవుడ్ లో అలాంటి జంటలు కొన్ని ఉంటాయి. అవి హై ఓల్టేజ్ కాంబోలు.  టచ్ చేస్తే బ్లాక్ బస్టరే మరి. ఇక తెలుగు సినిమాను కొత్త పంధాలో నడిపించడానికి  ఎంతో మంది ఎన్నో రకాలుగా తమ ప్రయత్నాలు చేశారు.

ఇక రెండువేల సంవత్సరం తరువాత టాలీవుడ్ హీరో స్టైల్ ని మార్చేసిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజాను ముందు చెప్పుకోవాలి. హీరో అంటే గంభీరంగా ఉండనక్కరలేదని, వెటకారం మాటలు, ఆ ఒళ్ళు విరుపులు, తనదైన కామెడీ డైలాగ్స్ తో కూడా ఆడియన్స్ ని  అట్రాక్ట్ చేయవచ్చునని రవితేజా పక్కాగా  చేసి చూపించాడు.

రవితేజా సినిమాల్లో హీరో నాచురల్ గా ఉంటాడు. ఇక్కడ నటన కంటే యాటిట్యూడే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా యాటిట్యూడ్ ని పట్టుకుని కంటెంట్ ని డిజైన్ చేసి రెండు గంటల సినిమాను తీయడంలో సిద్ధ హస్తుడు పూరీ జగన్నాధ్. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికి అయిదు సినిమాలు వస్తే అందులో మూడు బ్లాక్ బస్టర్లు. అంటే ఎంత క్రేంజీ కాంబో వీరిదో అర్ధమవుతుంది.

ఇక ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా త్వరలో వస్తోంది అంటున్నారు. క్రాకెత్తించే హిట్ తో రవితేజా ఫుల్ జోష్ లో ఉన్నాడు. దీని తరువాత వచ్చే ఖిలాడీతో దుమ్ము రేపడానికి రెడీ అవుతున్నాడు. ఇదే ఏడాది వీలు అయితే మూడవ సినిమాను కూడా థియేటర్లలో దింపడానికి రవితేజా రెడీ అవుతున్నాడు.

సరిగ్గా పూరీదీ ఇదే స్టోరీ, ఇస్మార్ట్ శంకర్ అంటూ టాలీవుడ్ టోటల్ గా దద్దరిల్లేలా  రీసౌండ్ చేసిన పూరీ బ్లాక్ బస్టర్లు ఎలా ఇవ్వవచ్చో మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఇపుడు ఈ ఇద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు కలిస్తే మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని అంతా అంటున్నారు. సో చాలా తొందరలోనే వీరి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. చాలా తొందరగా థియేటరలో బొమ్మ కూడా పడడం ఖాయం. ఎందుకంటే ఇద్దరూ స్పీడ్ గా మూవీని చేసే వారే.




ఆకట్టుకుంటున్న జాతి రత్నాలు టీజర్....

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>