ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishan-reddya2869e7b-1ab5-4b7c-8f9a-383def5d25f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishan-reddya2869e7b-1ab5-4b7c-8f9a-383def5d25f2-415x250-IndiaHerald.jpgభారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోంది అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆయన ఈ రీతిలో ఘాటుగా బదులిచ్చారు. ఎవరు దేశ భక్తులో, ఎవరు కాదో ప్రజలకు అన్నీ తెలుసునని వ్యాఖ్యానించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘భారత భూభాగం ఎవరి హయాంలో అక్రమణకు గురైందో దేశ ప్రజలందరికీ తెలుసు. భారత భూభాగాన్ని చైనాకు ఎవరు ఇచ్చారో తెలియాలంటే రాహుల్ గాంధీ తన తాత (జవహర్ లాల్ నెహ్రూ)ను అడగాలి. అప్పుడు సరైన సమాధానం వస్తుంది’ అని కిషన్ రెడ్డి అన్నారు.kishan reddy;rahul new;rahul;k l rahul;bharatiya janata party;india;rahul gandhi;narendra modi;mohandas karamchand gandhi;g kishan reddy;congress;media;minister;rahul sipligunj;central government;reddy;shakti;kothapalli samuel jawaharరాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి....రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి....kishan reddy;rahul new;rahul;k l rahul;bharatiya janata party;india;rahul gandhi;narendra modi;mohandas karamchand gandhi;g kishan reddy;congress;media;minister;rahul sipligunj;central government;reddy;shakti;kothapalli samuel jawaharFri, 12 Feb 2021 23:30:00 GMTకాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటానికి గల ప్రధాన కారణం... భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోంది అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆయన ఈ రీతిలో ఘాటుగా బదులిచ్చారు. ఎవరు దేశ భక్తులో, ఎవరు కాదో ప్రజలకు అన్నీ తెలుసునని వ్యాఖ్యానించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘భారత భూభాగం ఎవరి హయాంలో అక్రమణకు గురైందో దేశ ప్రజలందరికీ తెలుసు. భారత భూభాగాన్ని చైనాకు ఎవరు ఇచ్చారో తెలియాలంటే రాహుల్ గాంధీ తన తాత (జవహర్ లాల్ నెహ్రూ)ను అడగాలి. అప్పుడు సరైన సమాధానం వస్తుంది’ అని కిషన్ రెడ్డి అన్నారు.



లడఖ్‌లో భారత్ - చైనా సరిహద్దుల్లో 9 నెలలుగా ఉద్రిక్తతలు చోటు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందని, మన భూభాగాన్ని అక్రమించిందని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ మేరకు వార్తా కథనాలను వెలువరించాయి. చైనా దురాక్రమణ చేసిందంటూ శాటిలైట్ చిత్రాలను కూడా ప్రదర్శించాయి. రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీశారు. భారతదేశాన్ని చైనా అక్రమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని రాహుల్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ చేతగానితనం వల్లే సరిహద్దుల్లో చైనా దూకుడు విధానాలను అవలంభిస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. భారత్ శక్తి ఏమిటో శత్రు దేశాలకు తెలిసేలా చేశామని మరో ఆర్‌కే సింగ్ పేర్కొన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా తిప్పికొడతామని ప్రపంచానికి భారత్ సందేశం ఇచ్చిందని ఆయన అన్నారు.


జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఒకవైపు.. అవినాష్ ఒకవైపు అయినా టి.ఆర్.పి అదరగొట్టాడు..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>