PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections85cb194a-d8a0-4a35-8968-d5ccd9ddf780-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections85cb194a-d8a0-4a35-8968-d5ccd9ddf780-415x250-IndiaHerald.jpgకొత్త ఏడాది వచ్చింది. దాని ప్రత్యేకత ఏంటి అంటే కరోనా మహమ్మారి బెడద కొంత తగ్గింది. అదే సమయంలో ఎన్నికల జాతరకు తెర లేంచింది. ఒక వైపు దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతూండగానే వరస ఎన్నికలు తన్నుకుంటూ వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు జరుగుతూండగానే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. jagan-nimmagadda-elections;kumaar;panchayati;local language;marchజగడ్డ : మునిసిపల్ పోరుకు నోటిఫికేషన్...?జగడ్డ : మునిసిపల్ పోరుకు నోటిఫికేషన్...?jagan-nimmagadda-elections;kumaar;panchayati;local language;marchFri, 12 Feb 2021 10:30:00 GMTపంచాయతీ ఎన్నికలు జరుగుతూండగానే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది.

అదే సమయంలో ఇపుడు మిగిలిన స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో మునిసిపాలిటీలు, కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.  అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటికి కూడా ఎన్నికలు జరగాలి. ఈ నేపధ్యంలో ముందుగా మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలు రెండవ విడత ఈ నెల 13న జరగనున్నాయి. ఆ తరువాత ఈ నెల 17న మూడవ విడత ఎన్నికలు జరుగుతాయి. ఇక నాలుగ‌వ విడత‌ ఎన్నికలు ఈ నెల 21తో పూర్తి అవుతాయి. దాంతో మొత్తం పంచాయతీ ఎన్నికల సమరం పూర్తి అయినట్లే. మరో వైపు చూస్తే మునిసిపల్ ఎన్నికలు మార్చిలో నిర్వహించాలంటే పదిహేను రోజుల ముందు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలా కనుక చూసుకుంటే నేడో రేపో మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని అంటున్నారు.

ఏపీలో 76 దాకా మునిసిపాలిటీలు, అలాగే మరికొన్ని నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి.  వీటిలో పెద్ద కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఈ మొత్తం తతంగం రెండు విడతలుగా నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రణాళికను రూపొందిస్తోంది. మునిసిపాలిటీ ఎన్నికలు పూర్తి కావాలంటే మార్చి నెల మధ్య వరకూ సమయం పట్టవచ్చు అంటున్నారు. ఆ తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా నిమ్మగడ్డ‌ రమేష్ కుమార్ భావిస్తున్నారు. వాటిని నిర్వహించడానికి కచ్చితంగా మరో పదిహేను రోజుల సమయం పడుతుంది.  అలా కనుక చూసుకుంటే మార్చి నెలాఖరు నాటికి మొత్తం స్థానిక ఎన్నికలు పూర్తి అవుతాయని అంటున్నారు.






ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?

టీచర్ల వెతలు: వీళ్లు మనుషులు కారా..? వీళ్లకు కుటుంబాలు ఉండవా..?

వకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !

మైత్రీ మూవీ మేకర్స్ లైన్ అప్ చూసి షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>