PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp1050448b-25b6-44a9-8f16-b4665fd82ec8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp1050448b-25b6-44a9-8f16-b4665fd82ec8-415x250-IndiaHerald.jpgఆయ‌న గ‌తంలో వైసీపీలో ఉన్న‌ప్పుడు.. అంత‌కుముందు.. కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలోనూ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేవారు. అయితే.. ఇప్పుడు టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఎవ‌రికీ క‌నిపించ‌డం. పోనీ.. ఓట‌మి నేప‌థ్యంలో దూర‌మ‌య్యార‌ని అనుకున్నా.. ఎంతో మంది గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. యాక్టివ్‌గానే ఉన్నారు. చాలా మంది వెంట‌నే పుంజుకున్నారు. కానీ, సుజ‌య్ మాత్రం పుంజుకోలేక పోయారు. దీనికి వేరే కార‌ణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు వ్య‌తిరేకంగా మ‌రో టీడీపీ కీల‌క నేతtdp;district;mla;minister;letter;tdp;bobbiliఆ టీడీపీ మాజీ మంత్రి అడ్ర‌స్ చెప్ప‌రూ..?!ఆ టీడీపీ మాజీ మంత్రి అడ్ర‌స్ చెప్ప‌రూ..?!tdp;district;mla;minister;letter;tdp;bobbiliFri, 12 Feb 2021 13:17:00 GMTవిజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే.. సుజ‌య్ కృష్ణ‌రంగారావు.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చి ఏడాదిపైనే అయింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో ఉన్న ఆయ‌న టీడీపీలోకి జంప్ చేశారు. ఈ క్ర‌మంలోనే మంత్రి ప‌ద‌విని సంపాయించుకున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే.. ఓట‌మి పాలైన త‌ర్వాత‌.. ఆయ‌న ఏకంగా పార్టీకి, నియోజ‌క‌వ‌ర్గానికి కూడా క‌డుదూరంగా ఉంటున్నార‌నే విష‌యం నియోజ‌క‌వ‌ర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ``మా నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు`` అని టీడీపీ నాయ‌కులు బోర్డులు పెట్టుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది.

ఇక‌, సుజ‌య్ రాజ‌కీయ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఆయ‌న దూకుడు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న గ‌తంలో వైసీపీలో ఉన్న‌ప్పుడు.. అంత‌కుముందు.. కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలోనూ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేవారు. అయితే.. ఇప్పుడు టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఎవ‌రికీ క‌నిపించ‌డం. పోనీ.. ఓట‌మి నేప‌థ్యంలో దూర‌మ‌య్యార‌ని అనుకున్నా.. ఎంతో మంది గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. యాక్టివ్‌గానే ఉన్నారు. చాలా మంది వెంట‌నే పుంజుకున్నారు. కానీ, సుజ‌య్ మాత్రం పుంజుకోలేక పోయారు. దీనికి వేరే కార‌ణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు వ్య‌తిరేకంగా మ‌రో టీడీపీ కీల‌క నేత చ‌క్రం తిప్ప‌డంతోపాటు..త‌న అనుకున్న ఇంటి వారు కూడా వైసీపీతో మ‌చ్చిక చేసుకుంటుండ‌డంతో సుజ‌య్ ఎటు వైపు మాట్లాడాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. పైగా టీడీపీలో ఉన్నా.. ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి ద‌క్క‌లేదు. పార్టీలో ప్ర‌ధాన్యం కూడా లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఎవ‌రూ ఆయ‌న‌ను లెక్క‌చేయ‌డం లేదు.

మాజీమంత్రిగా పేరు త‌ప్ప‌.. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా గుర్తించేవారు క‌రువ‌వ‌డంతో ఏం చేయాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. ఇక‌, టీడీపీ నాయ‌కులు కూడా ఆయ‌న‌ను లైట్ తీసుకుంటున్నార‌ని.. అంటున్నారు. మొత్తానికి ఈ మాజీ మంత్రి పుంజుకునేదెప్పుడు? అనే ప్ర‌శ్న మాత్రం స‌మాధానం లేకుండా ఉండడం గ‌మ‌నార్హం.  


టీడీపీలో ఎస్ఈసీ హీరో.. చంద్ర‌బాబు జీరో... అదే ట్విస్ట్ ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>