PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-rk176c7a5f-f475-4e76-b85f-4afae5e24df5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-rk176c7a5f-f475-4e76-b85f-4afae5e24df5-415x250-IndiaHerald.jpgవై.ఎస్. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఇది తన అన్న జగన్‌కు ఇష్టం లేదన్న సంగతీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు రాకుండా.. వైసీపీ ముందుగానే సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రెస్ మీట్ పెట్టి ఖుల్లం ఖుల్లం చెప్పించింది. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ కు వచ్చి మరీ షర్మిలతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆర్కే ఎందుకు వచ్చి ఉంటారనే విషయంపై పెద్దగా ఆలోచించకుండా.. జగనే ఆర్కేను షర్మిల వద్దకు రాయబారం పంపాడంటూ కొన్ని ఛానsharmila-rk;alla rama krishna reddy;jagan;mla;press;ycp;party;sajjala ramakrishna reddyటాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?sharmila-rk;alla rama krishna reddy;jagan;mla;press;ycp;party;sajjala ramakrishna reddyFri, 12 Feb 2021 07:00:00 GMTపార్టీ పెట్టబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఇది తన అన్న జగన్‌కు ఇష్టం లేదన్న సంగతీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు రాకుండా.. వైసీపీ ముందుగానే సజ్జల రామకృష్ణారెడ్డితో  ప్రెస్ మీట్ పెట్టి ఖుల్లం ఖుల్లం చెప్పించింది. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ కు వచ్చి మరీ షర్మిలతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఆర్కే ఎందుకు వచ్చి ఉంటారనే విషయంపై పెద్దగా ఆలోచించకుండా.. జగనే ఆర్కేను షర్మిల వద్దకు రాయబారం పంపాడంటూ కొన్ని ఛానళ్లు హడావిడి చేసేశాయి. అవును మరి న్యూస్ ఛానళ్లకు ఆ మాత్రం న్యూస్ దొరికితే అల్లుకుపోవడం సహజమే కదా. అయితే ఇక్కడే కాస్త కామన్ సెన్స్ వాడి ఉండాల్సిందంటున్నారు విశ్లేషకులు. అందులో మొదటిది ఏంటంటే.. జగన్‌కు ఇలాంటి రాయబారాల్లాంటి వ్యవహారాలు నచ్చవు.. ఏదైనా డైరెక్ట్ వ్యవహారమే. అయినా సరే.. తప్పుదు అనుకుంటే.. రాయబారానికి తన కుటుంబ సభ్యులను ఎవరినో ఉపయోగించుకుంటారు.

అంతే తప్ప ఇలా ఓ ఎమ్మెల్యేను తన చెల్లి వద్దకు తాను రాయబారం పంపే అవకాశమే లేదు. మరో విషయం ఏంటంటే.. షర్మిలను పార్టీ పెట్టకుండా ఆపేందుకు తాము ప్రయత్నించిన మాట వాస్తవమేనిని మొన్న ప్రెస్ మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేశారు కూడా.. అంటే.. అన్ని ప్రయత్నాలు ముగిశాయి..ఇక ఏమీ చేయలేకే షర్మిల ఇష్టానికి ఆ నిర్ణయం వదిలేశామని చెప్పేశారు సజ్జల. అలాంటప్పడు మళ్లీ ఇక రాయబారం ఏముంటుంది.. ఇంతలోనే చర్చలకు పంపాల్సినంత సీన్ ఏముంది..?

ఇంకో కీలకమైన విషయం ఏంటంటే.. షర్మిల పార్టీ పెడుతున్నది తెలంగాణలో.. తెలంగాణలో వైసీపీకి అసలు ఇంట్రస్టే లేదు.. పార్టీనే పూర్తిగా ఎత్తేసుకున్నారు.. అలాంటప్పడు షర్మిల, జగన్ ప్రత్యర్థులుగా ఉండే అవకాశమే లేదు. అలాంటప్పుడు జగన్ రాయబారినికి పంపే అవకాశం ఎక్కడుంది.. మరి అన్నీ కాదంటే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు వచ్చాడంటారా.. ఆయనకు వైఎస్‌ ఫ్యామిలీ అంటే ఆపేక్ష ఎక్కువ.. ఏదో హైదరాబాద్‌ వచ్చినప్పుడు అలా పలకరించి వెళ్లి ఉండొచ్చు. ఏమంటారు..?




హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల Vs బ్రాహ్మణి ?

విజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ ఢిల్లీకి వెళ్ళింది దీనికేనా ?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>