Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwaldae59a6c-3991-4389-b8e7-7ef63dc1df54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwaldae59a6c-3991-4389-b8e7-7ef63dc1df54-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో కాజల్ అగర్వాల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అన్న విషయం తెలిసిందే . దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో రోజుల నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఇప్పటికి కూడా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు దశాబ్దం గడిచి పోతున్నప్పటికీ ఈ అమ్మాయి క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. కేవలం తెలుగు తమిళంలో మాత్రమే కాదు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుkajal;chiranjeevi;kamal hassan;shiva;kajal aggarwal;koratala siva;shankar;venkat;cinema;tamil;marriage;director;lord siva;thriller;girl;houseఆ ఇంటికి వెళ్ళాక.. రోజూ రాత్రి నిద్ర లేదు.. అనుభవాలను పంచుకున్న కాజల్..?ఆ ఇంటికి వెళ్ళాక.. రోజూ రాత్రి నిద్ర లేదు.. అనుభవాలను పంచుకున్న కాజల్..?kajal;chiranjeevi;kamal hassan;shiva;kajal aggarwal;koratala siva;shankar;venkat;cinema;tamil;marriage;director;lord siva;thriller;girl;houseFri, 12 Feb 2021 08:30:00 GMTకాజల్ అగర్వాల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అన్న విషయం తెలిసిందే .  దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో రోజుల నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఇప్పటికి కూడా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు దశాబ్దం గడిచి  పోతున్నప్పటికీ ఈ అమ్మాయి క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు.  కేవలం తెలుగు తమిళంలో మాత్రమే కాదు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇటీవల ఇక తన భర్తతో హనీమూన్ వెళ్లొచ్చిన కాజల్ అగర్వాల్ మళ్ళి వరుసగా సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధం అయింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తుంది కాజల్ అగర్వాల్. అంతేకాకుండా విష్ణు సరసన క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మోసగాళ్లు  సినిమాలో కూడా నటిస్తోంది.  అదేసమయంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో కూడా కమల్ హాసన్ సరసన ఛాన్స్ కొట్టేసింది.



 అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు వెబ్ సిరీస్ పై కన్ను  వేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన  లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్ లో నటించింది కాజల్ అగర్వాల్. అయితే ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.  అయితే ఈవెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను కాజల్ ఇటీవల అభిమానులతో పంచుకున్నారు.  వెబ్ సిరీస్ కోసం షూటింగ్ చేసిన ఇల్లు కొండపై ఉండేదని.. అది డైరెక్టర్ స్నేహితుడి కావడం..  షూటింగ్ కి అదే ఇల్లు సరిగ్గా సరిపోతుండటంతో ఇక ఇల్లును  సెలక్ట్ చేశారని దానికి చుట్టుపక్కల ఏ  ఇల్లు కూడా ఉండదని నిర్మానుష్యంగా చాలా భయంకరంగా ఉండేది అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.  షూటింగ్ చేసే సమయంలో ఎంతగానో భయపడిపోయా అని షూటింగ్కి ప్యాకప్  చెప్పి  ఇంటికి వెళ్ళినాక కూడా నిద్రపట్టేది కాదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు ఏ రోజు కూడా సరిగా నిద్రపో లేదు అంటూ తెలిపింది.


జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?

జగడ్డ: నిమ్మగడ్డకు జగన్ స్నేహ హస్తం.. ఇదిగో సాక్ష్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>