PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/uttarakhand7117ebbc-3e64-4cc9-85d8-2a5020f0eb00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/uttarakhand7117ebbc-3e64-4cc9-85d8-2a5020f0eb00-415x250-IndiaHerald.jpgప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఉత్తరాఖండ్ లో ఇటీవలే సంభవించిన పెను ప్రమాదకర సంఘటనకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఉపద్రవంలో అనేకమంది ప్రజలు చిక్కుకుపోవడం అందరినీ కలచివేస్తుంది. ఎన్నిరకాలుగా సహాయక చర్యలు చేపట్టినా ఫలితాలు మాత్రం అంతంత మాత్రమే. సమయం గడిచేకొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. 1500 మీ. పొడవైన తపోవన్ సొరంగంలో నాలుగు రోజులుగా 120 మీ. మేర మాత్రమే పూడికను తీయగలిగారు.ఇక డ్రిల్లింగే చివరి ఆశగా మారింది.uttarakhand;uttarakhand;februaryఉత్తరాఖండ్ దుర్ఘటన: ఇక అదే చివరి అవకాశంఉత్తరాఖండ్ దుర్ఘటన: ఇక అదే చివరి అవకాశంuttarakhand;uttarakhand;februaryFri, 12 Feb 2021 16:00:00 GMTఉత్తరాఖండ్ లో ఇటీవలే సంభవించిన పెను ప్రమాదకర సంఘటనకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఉపద్రవంలో అనేకమంది ప్రజలు చిక్కుకుపోవడం అందరినీ కలచివేస్తుంది. ఎన్నిరకాలుగా సహాయక చర్యలు చేపట్టినా ఫలితాలు మాత్రం అంతంత మాత్రమే. సమయం గడిచేకొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. 1500 మీ. పొడవైన తపోవన్ సొరంగంలో నాలుగు రోజులుగా 120 మీ. మేర మాత్రమే పూడికను తీయగలిగారు. ఇంకా నీరు, బురద కొట్టుకొస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది. కొన్ని చోట్ల మట్టి గట్టిపడటం కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్ ప్లాన్ మార్చారు. సొరంగం పైభాగం నుంచి డ్రిల్లింగ్ చేయడానికి నిర్ణయించారు. ఆ పనులు ప్రారంభమయయ్యాయి. తపోవన్ టన్నెల్‌లో 25 నుంచి 35 మంది కార్మికులు ఉన్నట్లు భావిస్తున్నారు.




గురువారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం ధౌలీగంగా ప్రవాహ మట్టం పెరగడంతో అక్కడ అలజడి రేగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా సహాయ కార్యక్రమాలను నిలిపేశారు. సుమారు గంట సేపటి తర్వాత రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. మరోవైపు డ్రిల్లింగ్ యంత్రం మొరాయించినట్లు తెలుస్తోంది. దాన్ని బయటకి తీసి, మరో యంత్రాన్ని తెప్పించారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్ పోలీసు దళానికి చెందిన 450 మందితో పాటు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, సైనికులు మొత్తం 600కు పైగా జవాన్లు సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. గల్లంతైన వారి జాడ గుర్తించేందుకు డ్రోన్‌ కెమెరాలు, రిమోట్‌ సెన్సింగ్‌ పరికరాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు 35 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో 29 మందిని గుర్తించారు. మృతుల్లో పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. గల్లంతైన వారిలో ఇద్దరు వ్యక్తులు అతి కష్టం మీద ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 172 మంది జాడ తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇక డ్రిల్లింగే చివరి ఆశగా మారింది.


ఉక్కు పాపాలు ఎవరివి...అదను చూసి కేంద్రం షాక్...?

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ

ఉప్పెన : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>