Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ramcharan-and-sankar-movie-announcedb16bb1da-8b8a-47c8-9e2a-c87d5e4e9873-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ramcharan-and-sankar-movie-announcedb16bb1da-8b8a-47c8-9e2a-c87d5e4e9873-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన పవర్ ఫుల్ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే జక్కన్నతో హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తరువాత కూడా చరణ్ మరో..ram charan;ram charan teja;ram pothineni;shankar;india;alluri sitarama raju;rrr movie;cinema;tamil;twitter;letter;dil;santosham;chitramచెర్రీ-శంకర్‌ సినిమా పక్కా.. ట్విటర్‌లో అఫీషియల్ న్యూస్చెర్రీ-శంకర్‌ సినిమా పక్కా.. ట్విటర్‌లో అఫీషియల్ న్యూస్ram charan;ram charan teja;ram pothineni;shankar;india;alluri sitarama raju;rrr movie;cinema;tamil;twitter;letter;dil;santosham;chitramFri, 12 Feb 2021 18:16:00 GMTఇంటర్నెట్ డెస్క్: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన పవర్ ఫుల్ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే జక్కన్నతో హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తరువాత కూడా చరణ్ మరో అద్భుతమైన డైరెక్టర్‌‌తో కలిసి సినిమా చేయబోతున్నాడు. రోబో, ఐ వంటి విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన తమిళ దర్శకుడు శంకర్‌తో రామ్‌చరణ్ తదుపరి సినిమా ఉండనుంది. దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ బయటకొచ్చింది.

రామ్‌చరణ్ తదుపరి సినిమాకు సంబంధించి పలువురు డైరెక్టర్ల పేర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అయితే చెర్రీ తన 15వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్‌తో చేయనున్నట్లు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. శంకర్-చెర్రీ కాంబినేషన్‌ల రాబోయే ఈ సినిమా కూడా పాన్‌ ఇండియా స్థాయిలోనే ఉండనుందట. ఈ విషయాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ చిత్రం దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌కు కూడా ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా సదరు నిర్మాణ సంస్థకు 50వ చిత్రం. ఈ నేపథ్యంలోనే సదరు ట్వీట్‌లో..‘ఇది మాకొక మైలురాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై 50వ చిత్రంగా ఇంతకు ముందెప్పుడూ చూడని రెండు బలమైన శక్తులను కలిపి తెరపై చూపించబోతున్నాం. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఇండియన్‌ సినిమా షో మెన్‌ శంకర్‌లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ పేర్కొంది.

ఇదిలా ఉంటే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమాలో చరణ్‌తోపాటు యశ్‌ కూడా భాగమయ్యే అవకాశాలున్నాయంటూ  కొన్ని రోజుల నుంచి సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, శంకర్‌-కమల్‌హాసన్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు-2’ షూట్‌ లాక్‌డౌన్‌ అనంతరం ఇంకా ప్రారంభం కాలేదు. ఇది పూర్తయిన తర్వాత చరణ్‌ సినిమా ఉంటుందా? లేక ప్రస్తుతానికి ‘భారతీయుడు-2’ పక్కన పెడతారా? అనే విషయాలపై క్లారిటీ లేదు. తాజా ప్రకటనతో మెగా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా సంబరాలు చేసుకుంటున్నారు.

" style="height: 627px;">
" style="height: 616px;">




షర్మిళ కీలక నిర్ణయం..!

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>