PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-india-china-make-a-decision934bc1ba-6ca3-45d2-bf2e-78e9f7d9e5ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-india-china-make-a-decision934bc1ba-6ca3-45d2-bf2e-78e9f7d9e5ad-415x250-IndiaHerald.jpgవాస్తవాధీన రేఖకు సమీపంగా మోహరించిన తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం (ఫిబ్రవరి 10) ప్రకటించింది. అదనపు బలగాలను ఉపసంహరించుకోవడంతో పాటు యుద్ధ ట్యాంకులు, యుద్ధ సామగ్రిని వెనక్కి తరలించడం ప్రారంభమైంది. ఇటు భారత్ కూడా రక్షణ బలగాలను ఉపసంహరించుకుంటోంది. ఈవిధంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌, చైనా చర్యలు చేపట్టాయి. ladakh;hari;hari music;india;media;2020;february;internationalఎట్టకేలకు లడఖ్ సరిహద్దులో భారత్, చైనాల బలగాల ఉపసంహరణ మొదలు...ఎట్టకేలకు లడఖ్ సరిహద్దులో భారత్, చైనాల బలగాల ఉపసంహరణ మొదలు...ladakh;hari;hari music;india;media;2020;february;internationalThu, 11 Feb 2021 17:30:00 GMTభారత్ - చైనా దేశాల మధ్య సరిహద్ధు ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న లడఖ్‌లో గత కొంత కాలంగా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్న వేళ చైనా దేశం ఒక కీలక ప్రకటన చేసింది. వాస్తవాధీన రేఖకు సమీపంగా మోహరించిన తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం (ఫిబ్రవరి 10) ప్రకటించింది. అదనపు బలగాలను ఉపసంహరించుకోవడంతో పాటు యుద్ధ ట్యాంకులు, యుద్ధ సామగ్రిని వెనక్కి తరలించడం ప్రారంభమైంది. ఇటు భారత్ కూడా రక్షణ బలగాలను ఉపసంహరించుకుంటోంది. ఈవిధంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌, చైనా చర్యలు చేపట్టాయి. 



తూర్పు లడఖ్‌లోని ప్యాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాల నుంచి చైనా, భారత్‌ బలగాల ఉపసంహరణ నేటి నుంచి ప్రారంభమైందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి యూ కియాన్‌ తెలిపారు. తొమ్మిదో రౌండ్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఇరు దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ అంశంపై భారత్‌ వైపు నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది. గత ఏడాది 2020, మే నెల నుంచి లడఖ్ సరిహద్దు వెంట భారత్, చైనా దేశాలకు చెందిన సైనిక బలగాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే చైనా వైపున కూడా నష్టం అంతకుమించి రెట్టింపు స్థాయిలోనే జరిగినట్లు అంతర్జాతీయ మీడియా ప్రధానంగా పేర్కొంది. అయితే.. డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం ఇప్పటివరకూ  విషయమై అసలు నోరు మెదపకపోవటం విశేషం.




మళ్ళీ మెగా హీరోతో బోయపాటి సినిమా....

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>