MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-happened-to-shankar-why-he-is-behavingc0ed1415-4c84-4fbd-b3ec-10453b8477ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-happened-to-shankar-why-he-is-behavingc0ed1415-4c84-4fbd-b3ec-10453b8477ee-415x250-IndiaHerald.jpgశంకర్‌ అంటే ఒకప్పుడు బ్లాక్‌బస్టర్స్‌కి కేరాఫ్ అడ్రస్. స్టార్‌ హీరోస్‌కి ఫస్ట్ ఆప్షన్. అలాంటి డైరెక్టర్‌ ఇప్పుడు చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమాని కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాడు. నిర్మాతల కండీషన్లు, టెక్నీషియన్ల వాకౌట్లతో సతమతమవుతున్నాడు శంకర్. మరి పాన్ ఇండియన్ డైరెక్టర్‌కి ఎందుకిలాంటి సమస్యలు వస్తున్నాయి.'ఐ' సినిమాకి ముందు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో శంకర్‌ ఎవరెస్ట్‌లా కనిపించాడు. సౌత్ స్టార్స్‌తో నార్త్‌నీ షేక్ వస్తున్నాడనే ప్రశంషలు తెచ్చుకున్నాడు.what happened to shankar why he is behaving;akshay kumar;kumaar;akshay;lyca productions;ravi anchor;shankar;cinema;panchayati;indian;ratnavelu;r rathnaveluశంకర్ కు ఏమయింది.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు..!శంకర్ కు ఏమయింది.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు..!what happened to shankar why he is behaving;akshay kumar;kumaar;akshay;lyca productions;ravi anchor;shankar;cinema;panchayati;indian;ratnavelu;r rathnaveluThu, 11 Feb 2021 19:25:03 GMTఇండియన్ డైరెక్టర్‌కి ఎందుకిలాంటి సమస్యలు వస్తున్నాయి.    

'ఐ' సినిమాకి ముందు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో శంకర్‌ ఎవరెస్ట్‌లా కనిపించాడు. సౌత్ స్టార్స్‌తో నార్త్‌నీ షేక్ వస్తున్నాడనే ప్రశంషలు తెచ్చుకున్నాడు. బాక్సాఫీస్‌ వండర్స్‌తో ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌ అనే రేంజ్‌కి వెళ్లాడు శంకర్. కానీ ఎప్పుడైతే 'ఐ' సినిమా వచ్చిందో అప్పటినుంచే శంకర్ గ్రాఫ్ డౌన్ అవ్వడం మొదలైంది.  వందకోట్లు పెట్టిన తీసిన 'ఐ' అంచనాలని అందుకోలేకపోయింది. ఫస్ట్‌ టైమ్ శంకర్ సినిమాపైనా నెగటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి.

'ఐ' విమర్శలకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వాలని 'రోబో' సీక్వెల్ 'టు పాయింట్ ఓ' రెడీ చేశాడు శంకర్. రజనీకాంత్‌, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్‌ లీడ్‌ రోల్స్‌లో అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో 'టు పాయింట్ ఓ' తీశాడు. కానీ ఈ సీక్వెల్‌ శంకర్‌కి మేలు చెయ్యకపోగా, మరిన్ని విమర్శలు తెచ్చిపెట్టింది. శంకర్‌ ఏంటి ఇలాంటి సినిమా తీశాడేంటనే నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

'టు పాయింట్ ఓ' రిజల్ట్‌తో శంకర్‌ గ్రాఫ్‌ కూడా మారిపోయింది. అప్పటివరకు శంకర్ ఎంత అడిగినా ఓకే చెప్పిన నిర్మాతలు 'టు పాయింట్ ఓ' తర్వాతి నుంచి నో చెప్పడం స్టార్ట్ చేశారు. 'ఇండియన్2'కి అడిగినంత బడ్జెట్‌ పెట్టలేం, మేం డిసైడ్ చేసిన మార్జిన్‌లోనే సినిమా తియ్యాలని శంకర్‌కి కండీషన్స్‌ పెట్టింది లైకా ప్రొడక్షన్స్.

లైకా ప్రొడక్షన్స్‌ కండీషన్స్‌కి మొదట శంకర్ ఒప్పుకోలేదు. రెండు సినిమాలు అటూఇటైతే బడ్జెట్‌ కట్ చేస్తారా అని వాదించాడు శంకర్. కానీ నిర్మాతలు మాత్రం మెట్టు దిగలేదు. దీంతో బయటి పరిస్థితులు బాగోలేవని శంకరే కాంప్రమైజ్ అయ్యాడు. నిర్మాతల మార్జిన్‌లోనే 'ఇండియన్-2' తియ్యడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ డీల్ కుదరడానికి చాలా టైమ్ పట్టింది. ఈ లోపు షెడ్యూల్స్‌ అన్నీ మారిపోయాయి. ఇక ఈ పంచాయతీ మనవల్ల కాదని సినిమా నుంచి వెళ్లిపోయాడు సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్.  

'ఇండియన్ 2' నుంచి రవి వర్మన్ వెళ్లిపోయాక రత్నవేలుని సినిమాటోగ్రాఫర్‌గా తీసుకుషెన్నాడు శంకర్. అయితే ఇప్పుడు రత్నవేలు కూడా వెళ్లిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. వాయిదాల పద్దతిలో సాగుతోన్న షూటింగ్‌తో, మరో సినిమాకి సైన్ చెయ్యలేకపోతున్నాడట రత్నవేలు. దీంతో 'ఇండియన్2'ని వదిలేస్తే బెటర్ అనుకుంటున్నాడట. మరి రత్నవేలు వెళ్లిపోకుండా శంకర్ ఏం చేస్తాడు.. ఇండియన్2' ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేస్తాడు అన్నది బిగ్‌ క్వశ్చన్‌గా మారుతోంది.




మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>