Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej-is-going-to-work-in-boyapati-directionf0901dbd-f855-481c-8fdf-a8a7ec67081f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej-is-going-to-work-in-boyapati-directionf0901dbd-f855-481c-8fdf-a8a7ec67081f-415x250-IndiaHerald.jpgమెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యువతరం హీరోల్లో స్టార్ హీరోగా ఎదిగాన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకడు. పరిశ్రమలోకి బ్యాక్ గ్రౌండ్‌తోనే వచ్చినా స్టార్ హోదాను మాత్రం తన స్వయం కృషితో సంపాదించాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయి ధరమ్ తేజ్ తన మొదటి సినిమాతోనే..mytri movies;balakrishna;boyapati srinu;jeevitha rajaseskhar;lahari;prema;sai dharam tej;srinivas;cinema;marriage;love;success;prati roju pandage;solo bathuke so betterబాలయ్య డైరెక్టర్‌తో మెగా మేనల్లుడు.. వామ్మో ఇదేం కాంబో సామీ..!బాలయ్య డైరెక్టర్‌తో మెగా మేనల్లుడు.. వామ్మో ఇదేం కాంబో సామీ..!mytri movies;balakrishna;boyapati srinu;jeevitha rajaseskhar;lahari;prema;sai dharam tej;srinivas;cinema;marriage;love;success;prati roju pandage;solo bathuke so betterThu, 11 Feb 2021 23:48:19 GMTఇంటర్నెట్ డెస్క్: మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యువతరం హీరోల్లో స్టార్ హీరోగా ఎదిగాన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకడు. పరిశ్రమలోకి బ్యాక్ గ్రౌండ్‌తోనే వచ్చినా స్టార్ హోదాను మాత్రం తన స్వయం కృషితో సంపాదించాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయి ధరమ్ తేజ్ తన మొదటి సినిమాతోనే హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర సేల్, సూప్రీమ్ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించాడు. ఆ తరువాత కొంత కాలం పాటు వరుస ప్లాప్‌లు తేజ్‌ను వెంటాడాయి. ఏ సినిమా చేసినా ప్లాప్ అవ్వడం ప్రారంభం అయింది. దాంతో సినిమా కథలకు ఆచి తూచి ఎంచుకోవడం మొదలు పెట్టాడు. అప్పడు తెరకెక్కించిందే చిత్ర లహరి. ఈ సినిమాలో సక్సెస్ కోసం ఎతుకుతున్న ఒక ఫెల్యూర్ పాత్రలో సాయి తేజ్ నిమగ్నం అయిపోయాడు.

ఆ పాత్రను తనకుంటే మరెవ్వరూ అంత బాగా చేయలేరన్న రీతిలో పాత్రకు ప్రాణం పోశాడు. చిత్ర లహరి సినిమా ఎంతటి హిట్ అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ప్రతి రోజు పండగే సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కుటుంబంలోని సమస్యలను అద్భుతంగా చూపించాడు. ఆ తరువాత కరోనా రావడంతో దాదాపు ఏడాది పాటు ఏ సినిమా లేదు. ఆ తరువాత సాయి తేజ్ చేసిన మొదటి సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాలో ప్రేమ, పెళ్లి ఏమీ వద్దూ అని హిత బోద చేసే యువకుడి పాత్ర చేశాడు. కరోనా తరువాత థియేటర్లు తెరుచుకున్నా కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీ ఇవ్వడంతో బడాబడా హీరోలు కూడా వెనకడుగు వేశారు. కానీ అటువంటి సమయంలోనూ సాహసోపేతంగా సాయి తేజ్ తన సినిమాను విడుదల చేశాడు. కేవలం యాభైశాతం ఆక్యెపెన్సీలోనూ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. తన సినిమాతో చిత్ర సీమకు ధైర్యం చెప్పాడు.

ఇప్పుడు తాజాగా రిపబ్లిక్ అంటూ దేవకట్టా దర్శకత్వంలో ఓ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తను చేయాల్సిన సినిమా విషయంలో కూడా సాయి తేజ్ మంచి క్లారిటీతో ఉన్నాడంట. సాయి తేజ్ తదుపరి చిత్రాన్ని పవర్ దర్శకుడితో తెరకెక్కిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అతడెవరో కాదండీ పవర్ ఫుల్ పాత్రలకు, కథలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీనివాస్. లాక్ డౌన్ సమయంలో బోయపాటి ఓ మంచి కథను రాశాడంట, ఆ కథకు సోయి ధరమ్ తేజ్ అయితే సరిగ్గా సరిపోతాడనిపిచండంతో సాయి తేజ్‌ను సంప్రదించాడంట. కథ బాగా నచ్చడంతో సాయి తేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. అతి త్వరలోనే ప్రకటించనున్నారని సీనీ వర్గాలు అంటున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందనేది వేచి చూడాలి.


కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>