PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmersdb71eceb-d880-4b78-acf6-ba3ddaf1cbde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmersdb71eceb-d880-4b78-acf6-ba3ddaf1cbde-415x250-IndiaHerald.jpgరెండు నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులు.. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో తమ దూకుడును మరింతగా పెంచారు.తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఫిబ్రవరి 12 నుండి వివిధ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.మొదటగా ఫిబ్రవరి 12 నుంచి రాజస్థాన్‌లోని అన్ని టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ కలెక్షన్లను కొనసాగనీయబోమని,అలాగే పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా ఫిబ్రవరి 14న కొవ్వొత్తుల ర్యాలీ, ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా రైల్ రోకోలకు పిలుపిచ్చారుfarmers protest;amala akkineni;delhi;bharatiya janata party;january;capital;february;central government;dookuduఫిబ్రవరి 12 నుండి వివిధ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్న రైతు సంఘాల నేతలు...ఫిబ్రవరి 12 నుండి వివిధ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్న రైతు సంఘాల నేతలు...farmers protest;amala akkineni;delhi;bharatiya janata party;january;capital;february;central government;dookuduThu, 11 Feb 2021 14:30:00 GMTఇటీవలే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో దాదాపు రెండు నెలలకు పైగా పలు దేశవ్యాప్త రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్న రైతులు.. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో తమ దూకుడును మరింతగా పెంచారు. తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే ఫిబ్రవరి 12 నుండి వివిధ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఇక మొదటగా ఫిబ్రవరి 12 నుంచి రాజస్థాన్‌లోని అన్ని టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ కలెక్షన్లను కొనసాగనీయబోమని రైతు సంఘాల నేతలు తెలిపారు. అలాగే పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా ఫిబ్రవరి 14న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.




మరీ ముఖ్యంగా ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు గంటల పాటు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) బుధవారం (ఫిబ్రవరి 10) ఒక ప్రకటన విడుదల చేసింది. జనవరి 26, గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ల పరేడ్ సందర్భంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రైతుల ఆందోళన తగ్గుముఖం పట్టినట్లే కనిపించింది. కానీ మరలా ఉద్యమం క్రమక్రమంగా పుంజుకుంటుంది. ఇక ఇటీవలే హైవేల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు తమ తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందుకోసం సింఘు సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫిబ్రవరి 12 నుంచి చేపట్టబోయే పలు నిరసన కార్యక్రమాల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.




బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌

బిగ్ బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి... సూప‌ర్ ట్విస్ట్‌

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ ఎన్నిక... టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగే షాక్

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>