PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పుడు అధికార విపక్షాలు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా మీడియాతో మాట్లాడిన సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ తో సెంటిమెంట్ ముడిపడి ఉంది అని ఆయన వెల్లడించారు. సెంటిమెంట్ ను గుర్తించి.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. సీఎం గారు చొరవ తీసుకొని... అందరూ ఎంపిలనుys jagan;bharatiya janata party;jagan;janasena;vishakapatnam;prime minister;cbi;minister;lakshmi devi;tdp;central government;ycp;janasena partyజగన్ కు సిబిఐ మాజీ జెడి రిక్వస్ట్జగన్ కు సిబిఐ మాజీ జెడి రిక్వస్ట్ys jagan;bharatiya janata party;jagan;janasena;vishakapatnam;prime minister;cbi;minister;lakshmi devi;tdp;central government;ycp;janasena partyThu, 11 Feb 2021 21:30:00 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పుడు అధికార విపక్షాలు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా మీడియాతో మాట్లాడిన సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ తో సెంటిమెంట్  ముడిపడి ఉంది అని ఆయన వెల్లడించారు. సెంటిమెంట్ ను గుర్తించి.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. సీఎం గారు చొరవ తీసుకొని... అందరూ ఎంపిలను ఢిల్లీకి తీసుకు వెళ్లి ప్రధాని కలిస్తే బాగుంటుంది అని ఆయన సూచించారు.

పార్టీలకు అతీతంగా అందరూ ఒక తాటిపైకి వచ్చి పోరాడాలి అని ఆయన తెలిపారు. అప్పుడే కేంద్రం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు. ఇక ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సి ఐ టి యు  ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కార్మిక, ప్రజా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మిక సంఘం నాయకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నాం అని ఆయన అన్నారు.

ఇప్పుడు బిజెపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది అని ఆయన ఆరోపించారు. పోస్కో సంస్థ తో ఒప్పందం జరిగినట్లు కేంద్ర మంత్రి చెప్పారు అని అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆందోళనలు పట్టించుకోకుండా అహంకారం తో మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి, వామపక్ష పార్టీలు వ్యతిరేకించినా కేంద్రం వెనక్కి తగ్గరా అని నిలదీశారు. ఇక్కడి ప్రజల నిర్ణయం గౌరవిస్తారా... పోస్కో కు ప్రాధాన్యత ఇస్తారా అని ప్రశ్నించారు. త్రివేండ్రం విమానాశ్రయం విషయంలో అక్కడి ప్రభుత్వం వ్యతిరేకించింది అన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయల అస్తి ఆంధ్రా ప్రజలది అని ఆయన వెల్లడించారు.


ఎన్.టి.ఆర్, త్రివిక్రం.. ప్లాన్ ఛేంజ్..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>