MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sushmita-sen-gave-him-everything-but-now172560e3-ccf2-4a5b-a156-c96f2b63c8ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sushmita-sen-gave-him-everything-but-now172560e3-ccf2-4a5b-a156-c96f2b63c8ad-415x250-IndiaHerald.jpgసుస్మితాసేన్, న్యూ లవ్ స్టోరీ కూడా కంచికి చేరుతోందా.. మోడల్‌ రోహమాన్‌ షాల్‌కి కటీఫ్ చెప్తోందా.. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి పోస్ట్‌ పెట్టిందా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇక సుస్మిత లేడీ సల్మాన్‌ ఖాన్‌లా మిగిలిపోవడమే కామెంట్‌ చేస్తున్నారు. సుస్మితా సేన్‌ లైఫ్‌లో ఇప్పటికే చాలా బ్రేకప్ స్టోరీస్‌ ఉన్నాయి. ఎర్లీ ట్వంటీస్‌ నుంచి ఫార్టీ క్రాస్‌ చేసేవరకు లవ్వులు, బ్రేకప్పులతోనే జర్నీ చేస్తోంది సుస్మిత. కెరీర్‌ బిగినింగ్‌లో డైరెక్టర్‌ విక్రమ్‌ భట్‌తో ప్రేమలో పడింది సుస్మిత. sushmita sen gave him everything but now;vikram bhatt;vikram;cinema;marriage;love;director;hero;love story;journeyసుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!sushmita sen gave him everything but now;vikram bhatt;vikram;cinema;marriage;love;director;hero;love story;journeyThu, 11 Feb 2021 20:00:00 GMTలవ్ స్టోరీ కూడా కంచికి చేరుతోందా.. మోడల్‌ రోహమాన్‌ షాల్‌కి కటీఫ్ చెప్తోందా.. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి పోస్ట్‌ పెట్టిందా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇక సుస్మిత లేడీ సల్మాన్‌ ఖాన్‌లా మిగిలిపోవడమే కామెంట్‌ చేస్తున్నారు.

సుస్మితా సేన్‌ లైఫ్‌లో ఇప్పటికే చాలా బ్రేకప్ స్టోరీస్‌ ఉన్నాయి. ఎర్లీ ట్వంటీస్‌ నుంచి ఫార్టీ క్రాస్‌ చేసేవరకు లవ్వులు, బ్రేకప్పులతోనే జర్నీ చేస్తోంది సుస్మిత. కెరీర్‌ బిగినింగ్‌లో డైరెక్టర్‌ విక్రమ్‌ భట్‌తో ప్రేమలో పడింది సుస్మిత. అయితే అప్పటికే పెళ్లైన విక్రమ్ భట్, సుస్మితని టైమ్‌పాస్‌లా చూశాడు గానీ, సీరియస్‌గా తీసుకోలేదు. పైగా సుస్మితతో ఎఫైర్ పెట్టుకుని నా భార్యని చాలా బాధపెట్టానని ఓపెన్ స్టేట్మెంట్స్‌ కూడా ఇచ్చాడు విక్రమ్ భట్.

సుస్మితా సేన్ బాలీవుడ్‌ హీరో రణ్‌దీప్ హుడాతో కూడా రిలేషన్‌లోకి వెళ్లింది. 'కర్మ ఔర్ హోళి' సినిమా టైమ్‌లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ డెవలప్ అయ్యిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతూ ఇద్దరూ కలిసి ముంబాయి అంతా తిరిగేశారు. కానీ ఈ రిలేషన్‌ కూడా ఎక్కువకాలం సాగలేదు.

సుస్మితా సేన్ ముంబాయి బేస్డ్ బిజినెస్‌మెన్ రితిక్ భాసిన్‌తో రిలేషన్‌లో ఉందని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. అలాగే పాకిస్థానీ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌ని పెళ్లి చేసుకుంటుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిని సుస్మిత బేస్‌లెస్‌ న్యూస్ అని కొట్టిపారేసింది. తర్వాత 'దుల్హా మిల్ గయా' డైరెక్టర్ ముదాస్సర్ అజీజ్‌తోనూ ప్రేమలో పడింది. అయితే సుస్మితతో తిరిగినన్ని రోజులు తిరిగి, మా ఫ్యామిలీ బాధ పడుతోందని సుస్మితకి కటీఫ్ చెప్పాడు ముదాస్సర్.

సుస్మితా సేన్ ఇప్పుడు తన కంటే 15ఏళ్లు చిన్నోడైన రోహమాన్ షాల్‌తో రిలేషన్లో ఉంది. రెండేళ్ల నుంచి సుస్మిత ఇంట్లోనే ఉంటున్నాడు రోహమాన్. ఇక రీసెంట్‌గా సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. మగవాళ్లు ప్రేమించిన ఆడవాళ్లని టేకిట్‌ గ్రాంటెడ్‌గా చూస్తారు. ఎన్ని తప్పులు చేసినా, క్షమిస్తారని భ్రమ పడతారు. కానీ ఆడవాళ్లకి నచ్చకపోతే ఆ బంధాన్ని కూడా వదిలేస్తారని పోస్ట్ పెట్టింది. దీంతో రోహమాన్‌తో రిలేషన్‌ చెడిందా అని అనుమానిస్తున్నారు నెటిజన్లు. మరి సుస్మితా ఈ పోస్ట్‌ ఎందుకు పెట్టిందో తెలియాలి.






మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?

జగడ్డ : బాబు కళ్ళలో ఆనందం కోసం అంటున్న మాజీ మంత్రి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>