Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/thieft4306f0d4-6294-44b0-87f2-78850b9fbd45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/thieft4306f0d4-6294-44b0-87f2-78850b9fbd45-415x250-IndiaHerald.jpgదొంగతనం చేయడం ఓ కళ. ఆ కళను సక్రమంగా చేస్తే.. ఆ దొంగ కూడా కళాకారుడే. అయితే ఎంత కళ అయినా.. దొంగతనం దొంగతనమే. కానీ కొన్ని సార్లు జరిగే దొంగతనాలు మాత్రం అందరి చేత ఔరా అనిపిస్తాయి. తాజాగా అలాంటి ఓ దొంగతనానికి సంబంధించిన..thieft;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;thief;office;donga;adhurs;fidaaదొంగోడి స్కెచ్ అదుర్స్.. వామ్మో ఇన్ని తెలివి తేటలా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!దొంగోడి స్కెచ్ అదుర్స్.. వామ్మో ఇన్ని తెలివి తేటలా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!thieft;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;thief;office;donga;adhurs;fidaaThu, 11 Feb 2021 23:05:00 GMTఇంటర్నెట్ డెస్క్: దొంగతనం చేయడం ఓ కళ. ఆ కళను సక్రమంగా చేస్తే.. ఆ దొంగ కూడా కళాకారుడే. అయితే ఎంత కళ అయినా.. దొంగతనం దొంగతనమే. కానీ కొన్ని సార్లు జరిగే దొంగతనాలు మాత్రం అందరి చేత ఔరా అనిపిస్తాయి. తాజాగా అలాంటి ఓ దొంగతనానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దొంగతనం చూసిన వారు ఆ దొంగను పట్టుకోవాలనే ఆలోచన కంటే.. ఆ దొంగ తెలివితేటలకు ఫిదా అవుతున్నారు.    

టెక్నాలజీ సాయంతో అనేక చోట్ల దొంగతనాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. దొంగలను పట్టుకోవడానికి కూడా ఈ వీడియోలు ఉఫయోగపడుతున్నాయి. అంతేకాదు, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో తెగ వైరల్ కూడా అవుతున్నాయి. ఆఫీసులో ఉద్యోగులంతా ఉన్నారు. వాళ్ల ఎదుట నోట్ల కట్ట ఉంది. కానీ దానిని ఏదో అవసరం కోసం అక్కడ ఉంచి, అంతా లెక్కలు వేసుకుంటున్నారు.    

ఓ వ్యక్తి పుస్తకంలో లెక్కలు చూసుకుంటుంటే.. మరో వ్యక్తి ఏదో పనిలో ఉన్నాడు. ఇంతలో అక్కడకికి ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడున్న వారిని ఏదో అడిగాడు. అలా అడుగుతున్న సమయంలోనే అతడి దృష్టి నోట్ల కట్టపై పడింది. అంతే, దానిని ఎలాగైనా నొక్కేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. తన టాలెంటుకు పని చెప్పాడు.     

ఒక చేతితో ఏవో పేపర్లు చూపిస్తూ మరో చేతితో ఆ నోట్ల కట్టను నొక్కేశారు. ఇంతటి తెలివితో నొక్కేయడంతో ఎవరికీ అనుమానం రాలేదు. తర్వాత అతడు వెళ్లిపోయాడు. కొంతసేపటికి డబ్బుల విషయం గుర్తుకువచ్చి, అంతా వెతికారు. ఉంటే కదా దొరికేంది. అప్పుడే వారికి ఆఫీస్‌లో ఉన్న సీసీ కెమెరా గుర్తుకొచ్చింది. అందులో చూడడంతో అసలు విషయం బయటపడింది. దొంగ దొరికిపోయాడు. అయితే దొంగిలించిన తీరును చూసి అక్కడున్న వాళ్లు అవాక్కయ్యారు.       

" draggable="true">
" draggable="true">
" draggable="true">
" draggable="true">




రెండేళ్లలో 12 సినిమాలు.. మైత్రీ మువీస్ పక్కా ప్లాన్ రెడీ..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>