PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-situation-in-myanmar-is-over610e9d55-8e68-4e5e-9163-edd4ca93db4b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-situation-in-myanmar-is-over610e9d55-8e68-4e5e-9163-edd4ca93db4b-415x250-IndiaHerald.jpgమయన్మార్‌లో నిరసన ప్రదర్శనలపై పోలీసుల అణచివేత ధోరణి కొనసాగుతోంది. రాజధాని నేపిడా సహా పలు నగరాల్లో నిరసనకారులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఆందోళనకారులపై వాటర్‌ కెనాన్‌లు ప్రయోగించారు. కొన్ని సందర్బాల్లో వారిపై రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ప్రజా ప్రభుత్వానికి తిరిగి అధికారం అప్పగించాలని, ఆంగ్‌ సాన్‌ సూకీ సహా ఇతర నేతలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నేపిడా, మాండలే నగరాల్లో పలువురు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే నిరసనలు, బహిరంగ సభలపై పోలీసులు నిషేధాజ్ఞలు the situation in myanmar is over;pratishta;tiru;american samoa;police;capitalమయన్మార్ లో పరిస్థితి చేయిదాటిపోయింది..!మయన్మార్ లో పరిస్థితి చేయిదాటిపోయింది..!the situation in myanmar is over;pratishta;tiru;american samoa;police;capitalThu, 11 Feb 2021 17:00:00 GMT
మయన్మార్‌లో నిరసన ప్రదర్శనలపై పోలీసుల అణచివేత ధోరణి కొనసాగుతోంది. రాజధాని నేపిడా సహా పలు నగరాల్లో నిరసనకారులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఆందోళనకారులపై వాటర్‌ కెనాన్‌లు ప్రయోగించారు. కొన్ని సందర్బాల్లో వారిపై రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ప్రజా ప్రభుత్వానికి తిరిగి అధికారం అప్పగించాలని, ఆంగ్‌ సాన్‌ సూకీ సహా ఇతర నేతలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నేపిడా, మాండలే నగరాల్లో పలువురు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే నిరసనలు, బహిరంగ సభలపై పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. దీంతో నిరసనకారులు తాము విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించారంటూ పోలీసులు వారిపై వాటర్ కెనన్లు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపి నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

నేపిడాలో రబ్బరు తూటాలతో ఆందోళనకారులపై కాల్పులు... పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దాదాపు 25 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. మయన్మార్‌లో జరుగుతున్న ఘనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని అభిప్రాయపడింది. సైనిక తిరుగుబాటుతో అక్కడ నెలకొన్న ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ఏం చేయాలన్నదానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపింది. నిరసనలు, బహిరంగ సభలపై సైనిక ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

దేశంలో ఎన్నికలు నిర్వహించిన తర్వాతే అధికారాన్ని అప్పగిస్తామని ప్రకటించారు సైన్యాధిపతి మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌. పౌర ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు లయాంగ్‌. గతంలో జరిగిన ఎన్నికల్లో మోసాలు జరిగాయని అందు వల్లే దేశాన్ని సైన్యం తమ అధీనంలోకి తీసుకుందని చెప్పారు.




ఆ జిల్లా అంతా ఇంతే.. టీడీపీ నుంచి రాత్రి గెలుపు.. ఉద‌య‌మే వైసీపీ కండువాలు..?

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>