HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/race-eandhulo-udhikinchi-thinty-machindhe-miku-tulusa64ef50d4-5667-4762-9687-b647a73e7d94-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/race-eandhulo-udhikinchi-thinty-machindhe-miku-tulusa64ef50d4-5667-4762-9687-b647a73e7d94-415x250-IndiaHerald.jpgఅన్నాన్ని మనం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా దాని వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషక పదార్థాలు మనకు లభిస్తాయి. అందుకే ఈ ప్రపంచంలో అత్యధికంగా, ప్రధానంగా తీసుకొనే ఆహారం అన్నము . మనం ప్రతిరోజూ తినే ఆహారంలో ఒక్కపూట అన్నం తింటే చాలు మనకి కడుపు నిండుతుంది. మన శరీరానికి కావలసిన శక్తి, కార్బోహైడ్రేట్లు కూడా అందుతాయి. ఒకప్పుడు రైస్ ని పాత్రలో నీళ్లు పోసి, ఉడికించి వార్చేవారు. అందులో ఉండే గంజిని వంచేసి, అన్నాన్ని తయారు చేసేవారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధం. మారుతున్న అదునాతన ప్రపంచంలో అన్నీrice,heating,;tara;iron;cancer;beans;cholesterol;aaviri;shaktiరైస్ ఎందులో ఉడికించి తింటే మంచిది? మీకు తెలుసా?రైస్ ఎందులో ఉడికించి తింటే మంచిది? మీకు తెలుసా?rice,heating,;tara;iron;cancer;beans;cholesterol;aaviri;shaktiThu, 11 Feb 2021 11:10:00 GMTఅన్నాన్ని మనం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా దాని వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషక పదార్థాలు మనకు లభిస్తాయి. అందుకే ఈ ప్రపంచంలో అత్యధికంగా, ప్రధానంగా తీసుకొనే ఆహారం అన్నము . మనం ప్రతిరోజూ తినే ఆహారంలో ఒక్కపూట అన్నం తింటే చాలు మనకి కడుపు నిండుతుంది. మన శరీరానికి కావలసిన శక్తి, కార్బోహైడ్రేట్లు కూడా అందుతాయి. ఒకప్పుడు రైస్ ని పాత్రలో నీళ్లు పోసి, ఉడికించి వార్చేవారు. అందులో ఉండే గంజిని వంచేసి, అన్నాన్ని తయారు చేసేవారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధం. మారుతున్న  అదునాతన ప్రపంచంలో అన్నీ కొత్తగా వుండాలని కోరుకుంటాము. అందుకు తగ్గట్టే వినియోగం కూడా ఉంటుంది.


అందులో భాగంగానే, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రెజర్ కుక్కర్ లు ఉంటున్నాయి. అంతేకాకుండా తాజాగా రైస్ కుక్కర్ లు కూడా వచ్చాయి. పైగా ప్రెజర్ కుక్కర్లో అన్నం వండటం సులభమే కాకుండా అన్నం పాడవుతుందని బెంగ కూడా ఉండదు. అయితే కుక్కర్లో వండిన అన్నం మంచిదా లేక ఉడికించి గంజి తీసేసి అన్నం తినడం మంచిదా అనే విషయం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ప్రెజర్ కుక్కర్లో ఉడికించిన అన్నంలో కెలోరీల శాతం తక్కువ. 100 గ్రాముల బాయిల్డ్ రైస్ లో 130 కేలరీలు ఉంటే,కుక్కర్లో వండిన అన్నం 151 కేలరీలు ఉంటాయని "యునెటైడ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్  అగ్రికల్చర్ " తెలిపింది. మనము ఉడికించిన గంజిని పారబోస్తాము . ఇలా చేయడం వలన అందులో ఉండే పోషకాలన్నీ బయటికి పోతాయి. బియ్యం త్వరగా ఉడుకుతాయి అనే ఉద్దేశంతో చాలామంది ముందుగా వాటిని నానబెట్టి కడుగుతారు. అలా చేసినా సరే పోషకాలన్నీ పోతాయి.

ఇక మనం రోజూ వాడే కాయగూరలు, బీన్స్, బంగాళదుంప వాటిల్లో వుండే ప్రధాన కార్బోహైడ్రేట్లు బియ్యం లో కూడా ఉంటాయి.  ప్రెజర్ కుక్కర్ లో ఆవిరి పై ఉండే అన్నంలో 33.88 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయని, పాత్రలో ఉడికించే అన్నంలో 28.17 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయని యు ఎస్ డి ఎ  పేర్కొంది.

ఉడికించిన గంజిని పారబోసినట్లయితే అందులో ఉండే న్యూట్రీషన్లు,  ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్,కొవ్వులు ఇలా అన్నీ కూడా బయటకు పోతాయి. అంతేకాకుండా ఫోలెట్,ఫాస్పరస్,మెగ్నీషియం, ఐరన్ వంటి న్యూట్రీషియన్ లు కూడా అన్నం లో ఉంటాయి. అన్నాన్ని వండి, వార్చి నట్టయితే అవన్నీ బయటికి పోతాయి. ప్రెజర్ కుక్కర్ లో ఆవిరి తో ఉడికించిన అన్నం లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. పాత్రలో బియ్యం ఉడికించడం వల్ల కలిగే ప్రయోజనం,అందులో ఉండే పిండి పదార్థాలను తొలగించడం ఒక్కటే. ప్రెజర్ కుక్కర్ లో అన్నం ఉడికేందుకు సరిపడ నీటిని మాత్రమే వాడుతారు.కాబట్టి దాని ద్వారా ఎక్కువ పోషకాలు బయటికి పోయే అవకాశం ఉండదు.

మనం ఎంచుకున్న రైస్ లో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిలో ఆఫ్లాట్ టాక్సిన్ లు అనే ఫంగస్ పాయిజన్ లివర్ క్యాన్సర్ ను కలిగిస్తుంది. ఈ వైరస్ 100 డిగ్రీల సెల్సియస్ వేడి లో ఉంచినా చావదు. ప్రెజర్ కుక్కర్ లో 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వెలువడుతుంది కాబట్టి,అందులో కొంత వరకు నశిస్తుంది. ఫలితంగా లివర్ కూడా బాగుంటుంది. కాబట్టి ప్రెజర్ కుక్కర్ ఆహారం మాత్రమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండడానికి ఇష్టపడకపోతే, ఇక పాత్రల్లో కూడా అన్నాన్ని వార్చకుండా వండడమే మంచిది.




బ్రేకింగ్‌: చింత‌మ‌నేని మ‌ళ్లీ చిక్కుల్లో ప‌డ్డారే ?

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>