MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjund3dd998a-b391-4bfd-9c8c-2096e6ed47f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjund3dd998a-b391-4bfd-9c8c-2096e6ed47f5-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెరంగ్రేటం చేసిన అల్లు అర్జున్ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోలో ఒక్కసారిగా మారాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు పరిశ్రమలో ఉన్న క్రేజే వేరు. స్టైలిష్‌ లుక్‌, యాక్టింగ్‌లో బన్నీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన డ్యాన్స్‌, యాక్టింగ్‌ స్కిల్స్‌తో అభిమానులను కట్టిపడేస్తాడు. allu arjun;view;allu arjun;ramu;cinema;telugu;bunny 1;arjun 1;gangothri;ala vaikuntapuramlo;kavuru srinivasఅల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఏంటంటే..!?అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఏంటంటే..!?allu arjun;view;allu arjun;ramu;cinema;telugu;bunny 1;arjun 1;gangothri;ala vaikuntapuramlo;kavuru srinivasThu, 11 Feb 2021 10:00:00 GMTఅల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెరంగ్రేటం చేసిన అల్లు అర్జున్ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోలో ఒక్కసారిగా మారాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు పరిశ్రమలో ఉన్న క్రేజే వేరు. స్టైలిష్‌ లుక్‌, యాక్టింగ్‌లో బన్నీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన డ్యాన్స్‌, యాక్టింగ్‌ స్కిల్స్‌తో అభిమానులను కట్టిపడేస్తాడు.

ఇంతవరకు తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చిన బన్నీ ఇక్కడ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు తన సినిమాల డబ్బింగ్ ద్వారా ఇటు మలయాళం, అటు హిందీలోనూ మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. సౌతిండియాలోని స్టార్ హీరోలెవరికి దక్కని ఘనత బన్నీకి దక్కింది. దీంతో ఆయన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా బన్నీ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌ గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ మూవీ బ్లాక్‌బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌, పాటలు విడుదలైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో బుట్టబోమ్మ పాట సంచలనం సృష్టించగా.. ఈ మూవీ ట్రైలర్‌ సైతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షకులను సంపాదించి టాప్‌ 20లో నిలిచింది.

తాజా ఈ మూవీలోని‌ ‘రాములో రాములా’ పాట మరో అరుదైన రికార్డు తెచ్చిపెట్టింది. ఈ ఫుల్‌ వీడియో సాంగ్‌ ఇప్పటి వరకూ 300 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ యూట్యూబ్‌ సెన్సేషనల్‌ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీతో ఎన్నో రికార్డు కొల్లగొట్టిన బన్ని తాజాగా ‘రాములో రాములో’ పాటతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫి అందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణీ, మంగ్లీలు ఆలపించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.


ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భార్యకు ఎటువంటి షరతులు పెట్టారో తెలుసా..

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>