PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/maharashtra8e27243f-bcf7-4ecb-9289-2cc8054b7edc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/maharashtra8e27243f-bcf7-4ecb-9289-2cc8054b7edc-415x250-IndiaHerald.jpgఉత్తరాఖండ్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ప్రయాణించడానికి గవర్నర్ నిరాకరించారు. అయితే గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రధాన కారణం సీఎం ఉద్ధవ్ ఠాక్రే అని తెలుస్తోంది. ప్రత్యేక వీవీఐపీ విమానంలో ప్రయాణానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నుంచి అనుమతి రాకపోవడంతో ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లో వెళ్లాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు ఏవియేషన్ వర్గాలు తెలిపాయి.maharashtra;mumbai;bharatiya janata party;korcha;maharashtra - mumbai;uttarakhand;uddhav thackeray;cm;chief minister;governor;maharashtra;indigo airlines;dehradunమరోసారి బయటపడ్డ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ల మధ్య పొరపచ్చాలుమరోసారి బయటపడ్డ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ల మధ్య పొరపచ్చాలుmaharashtra;mumbai;bharatiya janata party;korcha;maharashtra - mumbai;uttarakhand;uddhav thackeray;cm;chief minister;governor;maharashtra;indigo airlines;dehradunThu, 11 Feb 2021 22:20:00 GMTమహారాష్ట్రలో మరోసారి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మరియు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఉత్తరాఖండ్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ప్రయాణించడానికి గవర్నర్ నిరాకరించారు. అయితే గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రధాన కారణం సీఎం ఉద్ధవ్ ఠాక్రే అని తెలుస్తోంది. ప్రత్యేక వీవీఐపీ విమానంలో ప్రయాణానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నుంచి అనుమతి రాకపోవడంతో ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లో వెళ్లాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు ఏవియేషన్ వర్గాలు తెలిపాయి. 



గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రభుత్వ సెస్నా సైటేషన్ XLS విమానం కోసం ముంబయి విమానాశ్రయంలోని జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌కు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఆయన సిబ్బంది చేరుకున్నారు. ‘ఇదిలా ఉండగా ఒక వారం కిందట గవర్నర్ కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్‌ను రాజ్‌భవన్ రాష్ట్ర పౌర విమానయాన విభాగానికి పంపింది. ప్రోటోకాల్ ప్రకారం.. దీనికి ఆమోదం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. (రాష్ట్రానికి గవర్నర్ అధిపతి అయినా విమాన ప్రయాణానికి అనుమతి మాత్రం ముఖ్యమంత్రి ఆమోదం అవసరం.. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో గవర్నర్, ఆయన సిబ్బంది సాధారణ విమానంలో వెళ్లాలని నిర్ణయించారు’ అని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర పౌర విమానయాన విభాగం అధికారులు స్పందిస్తూ.. ఇందులో తమ జాప్యం లేదని పేర్కొన్నారు. విమానంలో ప్రయాణించడానికి ముఖ్యమంత్రి అనుమతి లాంఛనప్రాయం మాత్రమే.. అయినప్పటికీ, పలుసార్లు ప్రయత్నించినా సీఓఎం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సాధారణ విమానంలో వెళ్లిపోయారు’ అని ఓ అధికారి తెలిపారు.




‘సైటేషన్ ఎక్స్‌ఎల్‌ఎస్ సిబ్బంది టెర్మినల్ లాంజ్‌కు వెళ్లేసరికి గవర్నర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు... గవర్నర్ ప్రత్యేక విమానంలో వెళ్లడం ఇదే మొదటిసారి.. ముఖ్యమంత్రి ఆమోదం కోసం అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు’ అని పేర్కొన్నాయి. గవర్నర్ కోష్యారి విమానంలో సుమారు 15 నిమిషాలు కూర్చున్నారు.. ఈ సమస్య గురించి తెలియడంతో విమానం దిగి తిరిగి లాంజ్‌లోకి వెళ్లారు.. ఎయిర్‌లైన్ విమానంలో డెహ్రాడూన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు’అని ఆ వర్గాలు తెలిపాయి. ముంబయి నుంచి డెహ్రాడూన్‌కు రోజూ నాలుగు విమానాలు నడుస్తున్నాయి. ఇందులో రెండు ఉదయం 8 గంటల్లోపు బయలుదేరుతాయి. దీంతో మధ్యాహ్నం 12.15, 3.45 గంటలకు బయలుదేరే స్పైస్‌జెట్, ఇండిగో విమానంలో ఏదో ఒకదాంట్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసిందే. ఇదిలా ఉండగా దీనిపై సీఎంఓ ఇంత వరకూ స్పందించలేదు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది.




నరేంద్రమోడీ దేశాన్ని “హమ్ దో హమారో దో”అనే సిద్దాంతో నడిపిస్తున్నారు : రాహుల్ గాంధీ ....!!!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>