PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0a7f2f08-4316-483d-b6ef-59e81ad6fc07-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0a7f2f08-4316-483d-b6ef-59e81ad6fc07-415x250-IndiaHerald.jpgమహిళలు అంటేనే పుట్టడంతోనే మహారాణులే. వారు ఎక్కడ ఉంటే అక్కడ వారిదే హవా. మహిళలను ఎవరూ తక్కువగా అంచనా వేయడానికి లేనేలేదు. ఈ విషయంలో రెండవ మాటకు కూడా అసలు తావు లేవు. ఇదిలా ఉంటే మహిళలకు పెద్ద పీట వేయడానికి అన్ని వైపులా నుంచి పెద్ద ఎత్తున వత్తిడి వస్తోంది. jagan-nimmagadda-elections;vishakapatnam;panchayati;ycp;partyజగడ్డ : విశాఖలో మహిళా రాజ్యం...?జగడ్డ : విశాఖలో మహిళా రాజ్యం...?jagan-nimmagadda-elections;vishakapatnam;panchayati;ycp;partyThu, 11 Feb 2021 10:00:00 GMT
దానికి తోడు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుల సీట్లు యాభై శాతం మహిళలకు  రిజర్వేషన్లు అయ్యాయి. దాంతో గతంలో ఎన్నడూ చూడని సన్నివేశం గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి  కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఏకగ్రీవాలు 44 జరిగితే అందులో 27 మంది మహిళా సర్పంచులు ఎన్నికయ్యారు. ఇక ఇపుడు చూస్తే తొలి విడత ఎన్నికలు కూడా జరిగిపోయాయి.

దాంతో  ప్రజల మద్దతుతో గెలిచి 166 మంది మహిళలు గ్రామాలకు సర్పంచులుగా నెగ్గారు. ఇదిలా ఉంటే మొత్తం మీద చూసుకుంటే 187 మంది మహిళలు నెగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇది చాలా పెద్ద నంబర్. రెండవ, మూడవ నాలుగవ విడత పోలింగ్ కూడా ముందు ముందు ఉంది. ఇవన్నీ కలుపుకుంటే విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం 960కి పై బడి సర్పంచు పదవుల్లో మహిళలు దాదాపుగా అయిదు వందల వరకూ సర్పంచులుగా వస్తారు. అంటే ఒక విధంగా మహిళా రాజ్యం విశాఖలో వచ్చేసింది అన్న మాటేగా. ఇదే రేషియోలో వార్డు మెంబర్లు కూడా మహిళలు ఉంటారు.

మొత్తానికి అతివల సత్తా ఏమిటో ఈసారి పంచాయతీ ఎన్నికలతో నిరూపించారు అంటున్నారు. ఇదిలా ఉండగా తొలి విడత ఎన్నికలల్లో వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలిచారు. అందులోనే ఎక్కువ మంది మహిళలు కూడా ఉన్నారు. దాంతో మహిళలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం తమదేనని కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే వారి వెనకాల భర్తలు కూడా ఉన్నారు. వారు చేయీ కాలూ పెట్టకుండా ఉంటేనే అసలైన మహిళా రాజ్యం ఆవిర్భవిస్తుంది అని చెప్పాలి.






ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భార్యకు ఎటువంటి షరతులు పెట్టారో తెలుసా..

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!

జగడ్డ: "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్టు ఉంది బాబోరి వరుస ...?

మహేష్.. రాజమౌళి.. 'అతడు అడవిని జయించాడు'..!

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>