PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఎక్కువగా నమ్ముకుంటే అనవసరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకొని ప్రజల్లోకి వెళ్లాలి అని భావిస్తే అది పెద్దగా ఫలితం ఉండదు అనే విషయం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థమైంది. అప్పులు చేసి ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాలను జగన్ చాలా ఘనంగా అమలు చేశారు. కానీ ప్రజలలో మాత్రం అనుకున్న విధంగా పరిస్థితులు కనిపించడం లేదనే విషయం చెప్పవచ్చు. రys jagan;amala akkineni;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;ycp;partyసంక్షేమ కార్యక్రమాలు అనవసరమా...? జగన్ ఆలోచిస్తే మంచిదా...?సంక్షేమ కార్యక్రమాలు అనవసరమా...? జగన్ ఆలోచిస్తే మంచిదా...?ys jagan;amala akkineni;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;local language;ycp;partyThu, 11 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఎక్కువగా నమ్ముకుంటే అనవసరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకొని ప్రజల్లోకి వెళ్లాలి అని భావిస్తే అది పెద్దగా ఫలితం ఉండదు అనే విషయం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థమైంది. అప్పులు చేసి ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాలను జగన్ చాలా ఘనంగా అమలు చేశారు. కానీ ప్రజలలో మాత్రం అనుకున్న విధంగా పరిస్థితులు కనిపించడం లేదనే విషయం చెప్పవచ్చు.

రాజకీయంగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ని కొన్ని సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. స్థానిక నేతలకు వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధాలు తెగిపోవడం అలాగే ప్రజలలోకి కూడా కార్యక్రమాలు ఎక్కువగా వెళ్లకపోవడం  జరిగాయి. లబ్ధిదారులను తగ్గించడం వంటి చర్యలు సంక్షేమ కార్యక్రమాల మీద ప్రభావం చూపించాయి. పార్టీ పరిస్థితిపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని చాలామంది భావించారు.

సంక్షేమ కార్యక్రమాల అమలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా నాశనం అనే అంచనా  వేశారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ లో కూడా ధీమా పెరిగింది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. ఏకగ్రీవాల విషయంలో అధికార వైసీపీ ఎక్కువగా ప్రభావం చూపిన వాస్తవానికి ఎన్నికలు జరిగే విషయంలో మాత్రం తెలుగుదేశం విజయం సాధించింది. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఆలోచించుకుంటే మంచిది అని అభిప్రాయం  కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో చాలావరకు రోడ్ల అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. దీనితో పార్టీ ఎక్కువగా నష్టపోతుందని భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కూడా సంక్షేమ కార్యక్రమాల విషయంలో పెద్ద మంచి అభిప్రాయం లేదని అంటున్నారు. ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నామని చాలామంది ఆలోచిస్తున్నారని అంటున్నారు.


హైదరాబాద్ లో దారుణం..ఫార్మసీ స్టూడెంట్ పై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>