Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlief9a1166-6156-4f36-8316-26796370dc75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlief9a1166-6156-4f36-8316-26796370dc75-415x250-IndiaHerald.jpgకోహ్లీ కోపంతో ఉన్నాడు. అది కూడా ఎవరో ఆటగాడిమీద కాదు. ఏకంగా ఐసీసీపైనే. అవును టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ)పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో 227 పరుగుల తేడాతో..virat kohli;virat kohli;india;king;king 1;qualification;international;paruguఐసీసీనే ధిక్కరిస్తున్న కోహ్లీ..! ఇలా అయితే కష్టమేనా..?ఐసీసీనే ధిక్కరిస్తున్న కోహ్లీ..! ఇలా అయితే కష్టమేనా..?virat kohli;virat kohli;india;king;king 1;qualification;international;paruguThu, 11 Feb 2021 19:38:27 GMTకోహ్లీ కోపంతో ఉన్నాడు. అది కూడా ఎవరో ఆటగాడిమీద కాదు. ఏకంగా ఐసీసీపైనే. అవును టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ)పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో 227 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిన తరువాత ప్రపంచ టెస్టు చాంపియన్‌ ర్యాంకింగ్ లిస్ట్‌లో టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉండగా.. భారత్‌పై అద్భుత విజయాన్ని సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్ కొట్టేసింది.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో పర్సంటైల్‌ రూల్స్‌ మార్చడంపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై కోహ్లి అభ్యంతరం వ్యక్తం చేస్తూ..'పరిస్థితులు అదుపులో ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పుడు అంతా బాగానే ఉంది.. అలాంటప్పుడు రూల్స్‌ కూడా మారాలి.. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మ్యాచ్‌లు ఓడిపోవడం.. గెలవడం సహజమే.. అయినా మేం పాయింట్ల గురించి అంతగా బాధపడడం లేదు.. అయితే కొన్ని విషయాల్లో మీరు కనీసం ఆలోచన లేకుండా రూల్స్‌ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధగా ఉంది' అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.


కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌ ఎలాంటి మ్యాచ్‌లు జరగకపోవడంతో భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే ఆధ్వర్యంలో ఐసీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పీసీటీ(పర్సటైంజ్‌ ఆఫ్‌ పాయింట్స్‌) ఆధారంగా జట్ల స్థానాలు మారే అవకాశం ఉంటాయని అప్పట్లో నిర్ణయించారు. దీంతో ఈ విధానం ద్వారానే కొత్త పద్ధతలో పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే తొలి టెస్టు ఫలితం తరువాత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి(68.25 పాయింట్ల శాతం) పడిపోగా, ఇంగ్లండ్‌ (70.16 పాయింట్ల శాతం) అగ్రస్థానానికి చేరుకుంది. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే అవకాశాలకు తాజా పరాజయంతో కొంత దెబ్బ తిన్నాయి. అయితే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోలేదు. ఫైనల్‌ చేరాలంటే భారత్‌కు మరో 70 పాయింట్లు కావాలి. అంటే కనీసం 2 మ్యాచ్‌లలో విజయంతో పాటు మరో మ్యాచ్‌ డ్రా చేసుకున్నా చాలు.

అయితే తర్వాతి రెండు టెస్టులో ఒక్క మ్యాచ్‌ ఓడినా టెస్టు ఛాంపియన్‌షిప్ యాత్రలో టీమిండియా కథ ముగిసిపోతుంది. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌కు న్యూజిలాండ్‌ అర్హత సాధించిన మొదటి జట్టుగా ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌తో తలపడేందుకు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు పోటీలు ఉన్నాయి. వీటిలో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.


మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>