PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/twitter-will-care-about-their-staff287649f8-d696-42cf-8f42-5b1ffccc7938-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/twitter-will-care-about-their-staff287649f8-d696-42cf-8f42-5b1ffccc7938-415x250-IndiaHerald.jpgట్విట్టర్ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగాల్‌ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా.. ఆయనను ట్విటర్‌లోకి తిరిగి అనుమతించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.మా విధానాల ప్రకారం ప్లాట్‌ఫాం నుంచి ఒకసారి ఒకరిని తొలగించామంటే దాని అర్ధం జీవితకాల నిషేధమే..twitter;vedhika;american samoa;donald trump;january;facebook;media;capital;twitter;interview;lieట్రంప్ పై నిషేధం జీవితకాలం పాటు కొనసాగుతుంది - ట్విట్టర్ట్రంప్ పై నిషేధం జీవితకాలం పాటు కొనసాగుతుంది - ట్విట్టర్twitter;vedhika;american samoa;donald trump;january;facebook;media;capital;twitter;interview;lieThu, 11 Feb 2021 17:30:00 GMTఇటీవలే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన డొనాల్డ్ ట్రంప్... ఆ ఓటమిని తట్టుకోలేక బైడెన్ పై రకరకాల ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అవకాశం దొరికినప్పుడల్లా బహిరంగంగానే ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఇక ఆయన ప్రదర్శించిన ఆగ్రహావేశాలకు ప్రేరేపితులై జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఇక ఆ సంఘటన తర్వాత ఆయన ఖాతాను ట్విట్టర్ నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, డొనాల్డ్‌ ట్రంప్‌ను భవిష్యత్తులోనూ అనుమతించేది లేదని ట్విట్టర్ తేల్చిచెప్పింది. క్యాపిటల్‌ భవనంపై దాడికి ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్‌ ‘డీ ప్లాట్‌ఫామింగ్‌’ చేసింది. ఫేస్‌బుక్‌ ఇతర సోషల్ మీడియా సంస్థలు కూడా ఆయనపై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. హింసకు పాల్పడేలా ఎవరు ప్రేరేపించినా.. వారిని తమ వేదిక నుంచి తొలగించటమే కాకుండా తిరిగి రానివ్వబోమని ట్విట్టర్ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగాల్‌ స్పష్టం చేశారు. ‘మా విధానాల ప్రకారం ప్లాట్‌ఫాం నుంచి ఒకసారి ఒకరిని తొలగించామంటే దాని అర్ధం జీవితకాల నిషేధమే.. అది ఓ విమర్శకుడైనా, ఏదైనా సంస్థ సీఎఫ్‌ఓ అయినా, ప్రస్తుతం లేదా ఇదివరకు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా మా సంస్థ నియమాలు ఒకే విధంగా ఉంటాయి’ అని సీఎన్‌బీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెడ్ సెగాల్ వ్యాఖ్యానించారు.




2024 ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా.. ఆయనను ట్విటర్‌లోకి తిరిగి అనుమతించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించేందుకు ఎక్కువగా ట్విటర్‌పై ఆధారపడ్డారు. అంతేకాదు, రాజకీయ ప్రచారానికి, తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టేందుకు కూడా ఆయన ఈ మాధ్యమాన్నే ఉపయోగించేవారు. కాగా, ట్విట్టర్‌ నుంచి ఆయనను తొలిగించే నాటికి ఎనిమిది కోట్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అధికారిక ఖాతా నుంచి తొలగించిన తర్వాత ఇతర అకౌంట్‌ల నుంచి ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే, వీటిని ట్విట్టర్ తొలగించింది. హింసకు ప్రేరేపించారనే ఆరోపణలపై ట్రంప్ అభిశంసన విచారణ కాంగ్రెస్‌లో జరుగుతుండగా సెగల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ట్రంప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తే అధ్యక్ష పదవి లేదా రాజ్యాంగ బద్ధమైన పదవిని చేపట్టకుండా నిరోధించలేరు. కానీ ట్రంప్ తన అభిమాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో మాత్రం కనిపించరు. గత నెలలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే మాట్లాడుతూ.. ట్రంప్ ఖాతా విషయంలో తాము తీసుకున్న నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.




మళ్ళీ మెగా హీరోతో బోయపాటి సినిమా....

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>