PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/what-is-the-plan-of-sasikala-for-the-coming-elections617fae60-df03-44ec-81de-9b4671113083-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/what-is-the-plan-of-sasikala-for-the-coming-elections617fae60-df03-44ec-81de-9b4671113083-415x250-IndiaHerald.jpgశశికళకు తమిళనాడు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. తిరువల్లూర్ జిల్లాలో ఆమె బంధువులకు చెందిన 41.2 ఎకరాల భూమిని జప్తు చేసింది.తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, అమ్మకు నేనే నిజమైన వారసురాలినని శశికళ ప్రకటించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. sasikala;jayalalitha;tiru;january;collector;village;chief minister;krishnagiri;chennai;tamilnaduశశికళకు షాక్ ఇచ్చిన సీఎం పళనిస్వామిశశికళకు షాక్ ఇచ్చిన సీఎం పళనిస్వామిsasikala;jayalalitha;tiru;january;collector;village;chief minister;krishnagiri;chennai;tamilnaduThu, 11 Feb 2021 18:05:00 GMTదేశ రాజకీయాలన్నీ ఒక త్తు అయితే... ఒక్క తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మరొక త్తు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి ప్రధాన పార్టీలు అయినటువంటి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య జరిగే పోరు దేశంలోనే కాకుండా ఖండాంతర ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఇక తాజాగా అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తికావడంతో జనవరి 27న విడుదలైన జయలలిత నెచ్చెలి వీకే శశికళ.. రెండు రోజుల కిందట తమిళనాడుకు చేరుకున్న విషయం తెలిసిందే. స్వరాష్ట్రంలో శశికళకు అడుగడుగునా ఆమె అభిమానులు నీరాజనాలు పలికారు. అనేక సన్మానాలు, సత్కారాలు నిర్వహించారు.




ఇదిలా ఉండగా, శశికళకు తమిళనాడు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. తిరువల్లూర్ జిల్లాలో ఆమె బంధువులకు చెందిన 41.2 ఎకరాల భూమిని జప్తు చేసింది. శశికళ బంధువులు ఇళవరసి, వీఎన్ సుధాకర్‌కు చెందిన భూములను స్వాధీనం చేసుకుంది. కొద్ది రోజుల కిందటే చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం సహా తమిళనాడులోని పలు జిల్లాల్లోని భూములను జప్తు చేసింది. మీడియాకు తిరువల్లూరు కలెక్టర్ పి పొన్నయ్య విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది ఉత్తర్వులకు లోబడి ఉత్తుకొట్టయ్ తాలూకా వెలకాపూరం గ్రామంలోని ఓ ఆగ్రో ఫామ్‌కు చెందిన భూములను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

యితే ఈ ఆగ్రో ఫామ్‌‌కు సుధాకరన్, ఇళవరసి భాగస్వాములుగా ఉన్నట్టు తెలిపారు. ఈ భూమి ప్రస్తుతం ప్రభుత్వానికి చెందిందని కలెక్టర్ ప్రకటించారు. దీని నుంచి వచ్చిన ఆదాయం ప్రభుత్వానికే చెందుతుందని పేర్కొన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, అమ్మకు నేనే నిజమైన వారసురాలినని శశికళ ప్రకటించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు బుధవారం కృష్ణగిరి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ఎన్ని అవతారాలెత్తినా అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోలేరని అన్నారు. అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించిన వ్యక్తులు పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. అలాగే కొందరు ప్రణాళిక వేసి మరీ పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని పరోక్షంగా శశికళపై సీఎం పళనిస్వామి విమర్శలు గుప్పించారు.




డిఆర్డీఓ లో ఉద్యోగ అవకాశాలు..పూర్తి వివరాలు ఇవే..!

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>