PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-vs-ysrcp-in-nellore-district-local-polls757dba68-e2a0-4613-9879-bb8c1eb23e60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-vs-ysrcp-in-nellore-district-local-polls757dba68-e2a0-4613-9879-bb8c1eb23e60-415x250-IndiaHerald.jpgతొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. అదే సమయంలో టీడీపీ మద్దతుతో పోటీ చేసినా ఉపయోగం లేదనే విషయం కూడా తెలిసిపోతోంది. దీంతో వైసీపీలోనే వర్గాలు మొదలయ్యాయి. ఈసారి అవకాశం మాకివ్వండి అంటే మాకివ్వండి అంటూ.. గొడవకు దిగుతున్నారు నేతలు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేస్తున్నారు. jagan-nimmagadda-elections;nellore;chittoor;chittor;panchayati;tdp;local language;ycp;partyజగడ్డ: నెల్లూరులో వైసీపీ వర్సెస్ వైసీపీ..జగడ్డ: నెల్లూరులో వైసీపీ వర్సెస్ వైసీపీ..jagan-nimmagadda-elections;nellore;chittoor;chittor;panchayati;tdp;local language;ycp;partyThu, 11 Feb 2021 08:00:00 GMTపంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. అదే సమయంలో టీడీపీ మద్దతుతో పోటీ చేసినా ఉపయోగం లేదనే విషయం కూడా తెలిసిపోతోంది. దీంతో వైసీపీలోనే వర్గాలు మొదలయ్యాయి. ఈసారి అవకాశం మాకివ్వండి అంటే మాకివ్వండి అంటూ.. గొడవకు దిగుతున్నారు నేతలు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో తొలివిడతలో కూడా వైసీపీ బలపరచిన అభ్యర్థులకు రెబల్స్ బాధ తప్పలేదు. అయితే అదే సమయంలో గెలిచినవారు తిరిగి వైసీపీతోనే ఉంటారు కాబట్టి, పార్టీ పెద్దలు కూడా పెద్దగా ఆంక్షలు పెట్టడంలేదు. ఇక మిగతా మూడు విడతల్లో జరగాల్సిన ఎన్నికల్లో కూడా రెబల్స్ సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో వైసీపీని వైసీపీ నేతలే టార్గెట్ చేస్తున్నారు. ఇరు వర్గాలు పోటా పోటీగా ప్రచారం నిర్వహించడం కూడా ఇక్కడ గమనార్హం. ఓ దశలో వైసీపీ రెబల్స్ కి టీడీపీ నేతల సపోర్ట్ కూడా దక్కుతోంది. దీంతో అసలు పార్టీ బలపరచిన అభ్యర్థి ఎవరనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు.

ఎమ్మెల్యేలేం చేస్తున్నారు..?
ఎమ్మెల్యేలు మాత్రం ఈ స్థానిక గొడవల్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. పంచాయతీల్లో పోటీ చేసే అవకాశం తమకివ్వండి అంటూ రెండు వర్గాలు వస్తే.. ఇద్దరినీ పోటీ చేయాలని ప్రోత్సహించి పంపిస్తున్నారు. ఎవరు గెలిచి వస్తే వారిని దగ్గరకు తీస్తామని చెబుతున్నారు. దీంతో ఒకరకంగా ఎమ్మెల్యేలే రెండు వర్గాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో గెలుపుకోసం వైసీపీలోని రెండు వర్గాలు కొట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. చిత్తూరులో అయితే రెబల్స్ గా బరిలోకి దిగినవారిపై కొంతమంది పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారనే సమాచారం ఉంది. తాము కూడా అధికార పార్టీకి చెందినవారమేనని చెబుతున్నా వినిపించుకోవట్లేదని, ఇదెక్కడి అన్యాయం అంటూ వాపోతున్నారు. మొత్తమ్మీద టీడీపీ బలహీనంగా ఉన్న సమయంలో కూడా వైసీపీ తరపున ఏకగ్రీవాలు కావడంలేదంటే.. రెబల్స్ పోటీ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


బిజెపి గెలుపు కాదది... పవన్ క్రెడిట్

ఉప్పెన క్లైమాక్స్ సెటైర్ల పై స్పందించిన వైష్ణవ్ తేజ్ !

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఖచ్చితంగా క్రిష్టియానిటీ వదలిన బాణమే!

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలతో డౌన్ ఫాల్ స్టార్టయ్యిందట !

విశాఖ ఉక్కులో కొత్త ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన కేంద్రం..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడే షర్మిల పార్టీ చిచ్చు మొదలుపెట్టేసిందా ?

మెగాస్టార్ కు యాక్షన్ మూవీస్ బోర్ కొట్టేశాయా ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>