PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mayor-dy-mayor-of-ghmc22999d0c-0f45-45f2-aca3-18218b0920c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mayor-dy-mayor-of-ghmc22999d0c-0f45-45f2-aca3-18218b0920c0-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు సీల్డు కవర్ తెరిచి మేయర్‌ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ గా శ్రీలత రెడ్డి పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు గులాబీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు శుభాకాంక్షలు తెలిపారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది టీఅరెస్ నుంచి అందరూ ఊహించి నట్లే మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌ పార్టీ విధేయులనే వరించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కుమార్తె.mayor dy. mayor of ghmc;view;kumaar;sridevi kapoor;pragathi;srilatha;sriram;vijayalakshmi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;rajya sabha;doctor;mim party;local language;paritala sriram;father;reddy;party"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!mayor dy. mayor of ghmc;view;kumaar;sridevi kapoor;pragathi;srilatha;sriram;vijayalakshmi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;rajya sabha;doctor;mim party;local language;paritala sriram;father;reddy;partyThu, 11 Feb 2021 19:30:00 GMTడాక్టర్ కంచర్ల కేశవరావు, టీఅర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుని కూతురు, బంజారా హిల్స్ కార్పోరేటర్, గద్వాల విజయలక్ష్మి, నేడు ఎంఐఎం సహకారంతో “గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ - మేయర్‌” గా ప్రమాణ స్వీకారం చేశారు.


అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చాలా సీరియస్ గా
*“అవినీతి జరిగితే సహించను”
*“అందుకోసం ఎంత దూరమైనా వెళతాను”
*“ఎవరినీ వదిలిపెట్టేది లేదు”
*“పేదలకు అన్యాయం జరగకూడదు”
*“పార్టీలతో సంబంధం లేకుండా కార్పొరేటర్‌ గా ఎన్నికైన మహిళలు అందరిని, తన కుటుంబ సభ్యుల్లా కలుపుకుంటు ముందుకు వెళతాను”
*“హైదరాబాద్ నగరం అభివృద్ధికి కృషి చేస్తాను”
*“సభను గందరగోళం లేకుండా ఐదేళ్లు ప్రశాంతంగా నడిపిస్తాను”
“సభ్యులందరికి సహకరిస్తాను” అని విజయలక్ష్మి పేర్కొన్నారు.


బాష, “భాషా వాగ్ధాటి” చూస్తుంటే ఆమెలో, ఆమె తండ్రి కనిపించారు. ఆమె మాటల్ని బట్టి, వాగ్ధానాలను బట్టి చూస్తుంటే, ఈ కొత్త చీపురు అవినీతిని ఎంత పరిశుభ్రంగా, ఊడ్చివేస్తుందో(?) చూద్ధాం! అనుమానం ఎందుకంటే “ఈ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలొ ఉంది. ఎలా అంటే విజయలక్ష్మి మేయర్ అయింది వారి సహకారంతోనే కాబట్టి. ఈ స్థితిలో స్వతంత్రంగా మాట్లాడటం కూడా తప్పే”  


అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి ఆమె అమర వీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్‌ ను కలిసేందుకు ప్రగతి భవన్‌ కు బయలు దేరారు. (అక్కడ మరి కొంత స్వాతంత్రం కోల్పోయి, 'కాల్మొక్కుత బాంచన్ దొర స్థాయికి తగ్గటం' కోసం)


కాగా డిప్యూటీ మేయర్‌ గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్‌ కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. దీంతో ఎక్స్‌- అఫిషియా ఓట్లతో సంబంధం లేకుండానే మేయర్ ఎన్నిక పూర్తయ్యింది. అయితే, ఈ మద్దతును వ్యతిరేకిస్తూ కౌన్సిల్ హాల్‌ లో జై శ్రీరామ్ నినాదాలతో బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందరు ముందుగా చెప్పినట్లు గానే విజయలక్ష్మిని మేయర్ పీఠం వరించింది.


టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు సీల్డు కవర్ తెరిచి మేయర్‌ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ గా శ్రీలత రెడ్డి పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు గులాబీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు శుభాకాంక్షలు తెలిపారు.


మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది టీఅరెస్ నుంచి అందరూ ఊహించి నట్లే మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌ పార్టీ విధేయులనే వరించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా సభ్యులు ఎన్నుకున్నారు.


మేయర్‌ పీఠం కోసం తొలి నుంచి అధికార టీఆర్‌ఎస్ ‌లో విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

*సింధు ఆదర్శ్‌రెడ్డి భారతీనగర్‌ కార్పోరేటర్తో పాటు,
*మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి,
*పీజేఆర కూతురు విజయా రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.


అయితే రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌, చివరి నిమిషంలో       కే. కేశవరావు కుమార్తెను ఖరారు చేశారు. అయితే విజయా రెడ్డి సైతం మేయర్‌ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు.


అయితే ఇక్కడ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో ఎంఐఎం పార్టీ మద్దతు టీఆర్‌ఎస్‌కు లభించింది. అంటే జిహెచ్ఎంసీ అనే కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది కాబట్టి మేయరమ్మ ప్రేలాపనలకు విలువ ఉండదు. అసలు స్వాతంత్రమే ఉండదు. ఎందుకంటే ఎంఐఎం కితకితలు ఒకపక్క, అధిష్టానం చక్కిలిగింతలు మరోపక్క. మద్యలో మేయర్ పదవి దక్కని ఇతర కార్పోరేటర్ల నుంచి గిలిగింతలు.


ఇదే తొలి నుండీ బిజేపి వాళ్ళు ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెపుతూనే వస్తున్నారు. పాపం!  విజయలక్మి గద్వాల, ది మేయర్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్.





పాపం..తెలంగాణ ఉద్యోగులు!

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?

జగడ్డ : బాబు కళ్ళలో ఆనందం కోసం అంటున్న మాజీ మంత్రి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>