PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార విపక్షాల మధ్య ప్రధానంగా పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే అధికార వైసిపి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటం మరి కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉండటం... రెండిటి మధ్య ప్రధానంగా పోటీ ఉండడం ఎవరు గెలుస్తారో చెప్పలేకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా ఇప్పుడు ప్రత్తిపాడు నియోజysrcp;telugu desam party;andhra pradesh;telugu;minister;local language;ycp;partyఇదేంటి హోం మంత్రి గారూ... మీ నియోజకవర్గంలో ఇలానా...?ఇదేంటి హోం మంత్రి గారూ... మీ నియోజకవర్గంలో ఇలానా...?ysrcp;telugu desam party;andhra pradesh;telugu;minister;local language;ycp;partyThu, 11 Feb 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార విపక్షాల మధ్య ప్రధానంగా పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే అధికార వైసిపి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటం మరి కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉండటం... రెండిటి మధ్య ప్రధానంగా పోటీ ఉండడం ఎవరు గెలుస్తారో చెప్పలేకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఒప్పందాలు జరిగాయి.

ప్రధానంగా ఇప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన ఒప్పందం సంచలనంగా మారింది. ఇక్కడ హోంమంత్రి సుచరిత ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆమె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య జరిగిన ఒప్పందం సంచలనంగా మారింది. మూడున్నరేళ్ల  పాటు సర్పంచ్ గా మేము... అని వైసీపీ... ఏడాదిన్నర పాటు మేము అని తెలుగుదేశం పార్టీ అంగీకారం తెలిపింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్వయంగా హోం మంత్రి నియోజకవర్గంలో ఇలాంటివి జరగడంపై వైసీపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతలు హోంమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి ఒప్పందాన్ని చేసుకోవడం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి, ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు అధికారం వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకోవడం పై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీని అన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా కట్టడి చేయాలని భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష తో సర్పంచ్ స్థానాలకు గెలవాలా అనే ఆవేదన వైసీపీ అధిష్టానం నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి హోంమంత్రి నుంచి వివరణ అడుగుతారా లేదా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం గానే ఉన్నాయి అని చెప్పాలి.


పాపం..తెలంగాణ ఉద్యోగులు!

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....

రెండు రోజుల్లో అతి పెద్ద ఎన్నికకు నోటిఫికేషన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>