MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-in-that-movie-prabhas-was-not-first-choice-for-herof89cafc4-fafe-45cb-a53b-30ec575bb83e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-in-that-movie-prabhas-was-not-first-choice-for-herof89cafc4-fafe-45cb-a53b-30ec575bb83e-415x250-IndiaHerald.jpgఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ మూవీ తోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు కొనసాగిన ప్రభాస్ ఆపై వి వినాయక్ దర్శకత్వంలో యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ యోగి మూవీ చేశారు. స్టార్ నటి నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అప్పటి కడప మేయర్ పి రవీంద్రనాథ్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.prabhas-balayya;prabhas;balakrishna;kumaar;harika;harikrishnan;krishnam raju;nayantara;prasad;ramana;shivaraj kumar;v samudra;yogi;tollywood;cinema;kadapa;media;heroine;success;reddy;v;eshwarబాలయ్య చేయాల్సిన ఆ మూవీ ప్రభాస్ చేశారనే విషయం మీకు తెలుసా....??బాలయ్య చేయాల్సిన ఆ మూవీ ప్రభాస్ చేశారనే విషయం మీకు తెలుసా....??prabhas-balayya;prabhas;balakrishna;kumaar;harika;harikrishnan;krishnam raju;nayantara;prasad;ramana;shivaraj kumar;v samudra;yogi;tollywood;cinema;kadapa;media;heroine;success;reddy;v;eshwarThu, 11 Feb 2021 23:13:57 GMTఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ మూవీ తోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు కొనసాగిన ప్రభాస్ ఆపై వి వినాయక్ దర్శకత్వంలో యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ యోగి మూవీ చేశారు. స్టార్ నటి నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అప్పటి కడప మేయర్ పి రవీంద్రనాథ్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

అయితే వాస్తవానికి ఈ సినిమా యొక్క ఒరిజినల్ మాతృక అంతకుముందు కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా జోగి పేరుతో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టింది. ఇక తెలుగు లో రిలీజ్ తరువాత యోగి కూడా మంచి సక్సెస్ సాధించి హీరోగా ప్రభాస్ కి బాగా పేరు తెచ్చిపెట్టింది. రమణ గూగుల మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో ప్రముఖ సీనియర్ నటి శారదా నటించారు. అయితే ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి సముద్ర. జగపతి బాబు తో పెదబాబు, శివరామరాజు, అలానే హరికృష్ణ తో టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ వంటి సినిమాలు తీసి మంచి పేరు దక్కించుకున్న సముద్ర ప్రస్తుతం తీస్తున్న సినిమా జైసేన.

అతి త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా యోగి మూవీ గురించి ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ, నిజానికి యోగి మూవీని వినాయక్ కంటే ముందు నేను, బాలయ్య గారికి ఒరిజినల్ వెర్షన్ మూవీ చూపించానని, వీలైతే బాలయ్య తో ఆ మూవీ పక్కాగా చేయాలనేది తన ఆశ అని, అయితే అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వలన అది కుదరకపోవడంతో ఆ తరువాత వినాయక్ దానిని ప్రభాస్ తో తీశారని అన్నారు. ఆ విధంగా బాలయ్య చేయాల్సిన యోగి మూవీ ప్రభాస్ చేసినట్లు తెలుస్తోంది......!!  


బాలయ్య డైరెక్టర్‌తో మెగా మేనల్లుడు.. వామ్మో ఇదేం కాంబో సామీ..!

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>