MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/these-all-were-ok-but-when-was-the-actual-matter-availablec8567a2d-d96a-467d-9fb1-a18635bf70e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/these-all-were-ok-but-when-was-the-actual-matter-availablec8567a2d-d96a-467d-9fb1-a18635bf70e1-415x250-IndiaHerald.jpgభీభత్సం సినిమా ద్వారా టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎస్ ఎస్ థమన్, ఆ తరువాత మాస్ మహారాజ రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కిక్ మూవీ ద్వారా సూపర్ హిట్ కొట్టడంతో పాటు అందులోని సాంగ్స్ ద్వారా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన థమన్, ఆపై టాలీవుడ్ స్టార్ హీరోలయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి వారితో కూడా సినిమాలు చేసే అవకాశం అందుకున్నాడు. s thaman;mahesh;ntr;ravi;sharwanand;allu arjun;geetha;ravi teja;srinivas;surender reddy;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;rajani kanth;media;success;nandamuri taraka rama rao;arjun 1;kick;ala vaikunthapurramloo;dubai;reddy;tholi prema;mass;anandamఅబ్బబ్బా....ఏమి ఊరిస్తున్నావు....ఇంతకీ అసలు మ్యాటర్ ఎప్పుడు....??అబ్బబ్బా....ఏమి ఊరిస్తున్నావు....ఇంతకీ అసలు మ్యాటర్ ఎప్పుడు....??s thaman;mahesh;ntr;ravi;sharwanand;allu arjun;geetha;ravi teja;srinivas;surender reddy;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;rajani kanth;media;success;nandamuri taraka rama rao;arjun 1;kick;ala vaikunthapurramloo;dubai;reddy;tholi prema;mass;anandamThu, 11 Feb 2021 23:30:10 GMTసినిమా ద్వారా టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎస్ ఎస్ థమన్, ఆ తరువాత మాస్ మహారాజ రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కిక్ మూవీ ద్వారా సూపర్ హిట్ కొట్టడంతో పాటు అందులోని సాంగ్స్ ద్వారా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన థమన్, ఆపై టాలీవుడ్ స్టార్ హీరోలయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి వారితో కూడా సినిమాలు చేసే అవకాశం అందుకున్నాడు.

అలానే వాటితో మంచి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న థమన్, ఆపై వరుసగా ఛాన్స్ లతో మరింతగా దూసుకెళ్లారు. అయితే ఒకానొక సమయంలో కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనేటువంటి కొన్ని విమర్శలు ఎదుర్కొన్న థమన్, అనంతరం కెరీర్ పరంగా స్వల్ప విరామం తీసుకుని  ఆ తరువాత శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చి దాని ద్వారా సూపర్ హిట్ కొట్టి సాంగ్స్ కూడా అదరగొట్టాడు. ఇక ఆ తరువాత తొలిప్రేమ మూవీ సాంగ్స్ తో కూడా అలరించిన థమన్, ఇటీవల అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో మూవీ సాంగ్స్ ద్వారా ఏకంగా జాతీయ స్థాయిలో సంగీత దర్శకుడిగా గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం థమన్ చేతిలో చాలానే టాలీవుడ్ బడా హీరోల సినిమాలు ఉన్నాయి. అయితే వాటిలో ఒకటి సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సర్కారు వారి పాట. చాలా ఏళ్ల గ్యాప్ అనంతరము తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ సినిమా చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా ఈ మూవీ సాంగ్స్, బాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంటాయని ఇటీవల థమన్ మాట్లాడుతూ చెప్పారు.

అలానే ఇటీవల ఈ మూవీ గురించి వరుసగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు పోస్టులు పెడుతూ వస్తున్న థమన్, ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ స్పాట్ నుండి యూనిట్ తో దిగిన ఫోటోలు పోస్ట్ చేసాడు. అది మాత్రమే కాకుండా ఈ మూవీ లో ఇప్పటివరకు మూడు సాంగ్స్ కంపోజిషన్ పూర్తి అయిందని తన పోస్ట్ లో తెలిపాడు. అబ్బాబ్బా ఒక్కో పోస్ట్ తో ఏమి ఊరిస్తున్నావు, ఇంతకీ మేమందరం ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ సాంగ్స్ గురించి మాకు స్వీట్ న్యూస్ ఎప్పుడు చెప్తావు థమన్ బ్రో అంటూ పలువురు మహేష్ ఫ్యాన్స్ ఆయన ని తమ సోషల్ మీడియా ఆయనని ప్రశ్నిస్తూ అడుగుతున్నారు. మరి వారికి థమన్ ఏ విధంగా బదులిస్తారో చూడాలి.....!!


బాలయ్య డైరెక్టర్‌తో మెగా మేనల్లుడు.. వామ్మో ఇదేం కాంబో సామీ..!

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>