Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england-pacer-jofra-archer-shocking-comments-on-chennai-chidambaram-stadium5ae936da-832c-4d27-a99d-d6dfc9b87cfb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england-pacer-jofra-archer-shocking-comments-on-chennai-chidambaram-stadium5ae936da-832c-4d27-a99d-d6dfc9b87cfb-415x250-IndiaHerald.jpgచెన్నై‌లోని ఎం చిదంబరం స్టేడియంపై ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై ఘన విజయం సాధించిన తరువాత ఆర్చర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా చెన్నై పిచ్‌పై ఆర్చర్ ఆసక్తికర కామెంట్స్..jofra archer;audi;india;england;king;chennai;king 1;qualification;paruguఅమ్మో ఇదేం పిచ్.. చెన్నై పిచ్‌‌పై ఆర్చర్ షాకింగ్ కామెంట్స్!అమ్మో ఇదేం పిచ్.. చెన్నై పిచ్‌‌పై ఆర్చర్ షాకింగ్ కామెంట్స్!jofra archer;audi;india;england;king;chennai;king 1;qualification;paruguThu, 11 Feb 2021 22:51:57 GMTచెన్నై: చెన్నై‌లోని ఎం చిదంబరం స్టేడియంపై ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై ఘన విజయం సాధించిన తరువాత ఆర్చర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా చెన్నై పిచ్‌పై ఆర్చర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రధానంగా చెన్నై పిచ్‌ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. మ్యాచ్ ఐదో రోజు చెన్నై పిచ్ పూర్తిగా ఆరెంజ్ రంగులో మారిపోయిందని, అలాంటి పిచ్‌ను తన కెరీర్‌లో చూడలేదని అన్నాడు.

 ‘పిచ్ మొత్తం రంగు మారిపోయింది. ఎక్కడ చూసినా చీలికలు ఏర్పడ్డాయి. దీంతో బౌలర్లు వాటిపై బంతులు విసిరి బ్యాట్స్‌మెన్ బోల్తా కొట్టించడం సులువైంద’ని జోఫ్రా చెప్పాడు. అయితే చెన్నై పిచ్ మాత్రమే కాదని, భారత్‌లోని పిచ్‌లన్నీ మ్యాచ్ జరిగే కొద్దీ ఇలానే దెబ్బతింటాయని, ఇది ఇక్కడ సహజనమని ఆర్చర్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 227 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌తోనే ఇంగ్లండ్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. 578 పరుగులు భారీ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ముగించిన ఇంగ్లీష్ జట్టు.. భారత్‌ను కేవలం 337 పరగులకే ఆలవుట్ చేసింది. అయితే ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ కూడా ఇంగ్లాండ్ ఆడింది.

అనంతరం ఐదో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు కనీస పోరాటం కూడా చూపకుండా బ్యాట్స్‌మెన్ అంతా ఒక్కొక్కరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0తో ఆధిక్యం సాధించింది. ఇక రెండో మ్యాచ్ 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కూడా చెన్నై పిచ్‌లోనే ప్రారంభం కాబోతోంది.

ఇదిలా ఉంటే తొలి టెస్టు ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్‌ ర్యాంకింగ్ లిస్ట్‌లో టీమిండియా నాలుగో స్థానానికి దిగజారింది. ప్రస్తుతం ఈ పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉండగా.. తొలి టెస్టులో భారత్‌పై ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది. అయితే జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌కు న్యూజిలాండ్‌ అర్హత సాధించిన మొదటి జట్టుగా ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌తో తలపడేందుకు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు పోటీలు ఉన్నాయి. వీటిలో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.





బాలయ్య డైరెక్టర్‌తో మెగా మేనల్లుడు.. వామ్మో ఇదేం కాంబో సామీ..!

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>