PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionseb576d8f-4cfa-48e1-a48c-a41f343146c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionseb576d8f-4cfa-48e1-a48c-a41f343146c2-415x250-IndiaHerald.jpgఏపి పంచాయితీ ఎన్నికల జోరు ఇంకా కొనసాగుతుంది.. మొదటి విడత ఎన్నికల ఫలితాలు అనుకున్న దానికన్నా కూడా వ్యతిరేఖంగా వెలువడ్డాయి. గెలుపు మాదే అని టీడీపీ చంకలు గుద్దుకున్న నియోజక వర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయడం, వైసీపీ అనుకూలంగా స్థానాల్లో టీడీపీ, ఇతర పార్టీలు గెలుపొందాయి. ఇకపోతే ఇప్పుడు రెండో విడత ఎన్నికల పై అందరి దృష్టి పడింది. ఈ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కువ మంది ఏకగ్రీవాల పై మొగ్గు చూపుతున్నారు. jagan-nimmagadda-elections;bharatiya janata party;amaravati;andhra pradesh;janasena;district;chittoor;gold;chittor;panchayati;mandalam;husband;tdp;ycp;janasena party;v;partyజగడ్డ: చిత్తూరులో పరువు నిలబెట్టుకున్న బీజేపి, జనసేన..!జగడ్డ: చిత్తూరులో పరువు నిలబెట్టుకున్న బీజేపి, జనసేన..!jagan-nimmagadda-elections;bharatiya janata party;amaravati;andhra pradesh;janasena;district;chittoor;gold;chittor;panchayati;mandalam;husband;tdp;ycp;janasena party;v;partyThu, 11 Feb 2021 12:10:06 GMTఏపి పంచాయితీ ఎన్నికల జోరు ఇంకా కొనసాగుతుంది.. మొదటి విడత ఎన్నికల ఫలితాలు అనుకున్న దానికన్నా కూడా వ్యతిరేఖంగా వెలువడ్డాయి. గెలుపు మాదే అని టీడీపీ చంకలు గుద్దుకున్న నియోజక వర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయడం, వైసీపీ అనుకూలంగా స్థానాల్లో టీడీపీ, ఇతర పార్టీలు గెలుపొందాయి. ఇకపోతే ఇప్పుడు రెండో విడత ఎన్నికల పై అందరి దృష్టి పడింది. ఈ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కువ మంది ఏకగ్రీవాల పై మొగ్గు చూపుతున్నారు. 


ఇది ఇలా ఉండగా.. చిత్తూరులో ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గట్టిగా పోటీ ఇచ్చిన టీడీపీ , వైసీపీ పార్టీలతో పాటుగా బీజేపి, జనసేన  పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందారు. విషయానికొస్తే.. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, జనసేన మద్దతు అభ్యర్థులు ఒక్కోటి చొప్పున సర్పంచ్‌ స్థానాన్ని గెలుచుకున్నారు. విజయపురం మండలం మంగళంలో గెలిచిన బీజేపీ మద్దతు అభ్యర్థి వి.శాంతికి బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి మద్దతు ఇచ్చారు. బంగారుపాళ్యం మండలంలోని చీకూరిపల్లె పంచాయతీలో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గెలిచిన అమరావతి బుధవారం తాను జనసేన అభ్యర్థినంటూ నిర్ధారించారు.


వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లె పంచాయతీలో లలిత కాంగ్రెస్‌ మద్దతు అభ్యర్థిగా గెలిచారు. ఆమె భర్త భాస్కర్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.. పెనుమూరు మండలం నంజరపల్లెలో టీడీపీ మద్దతు అభ్యర్థి ఊహ, విజయపురం మండలం మంగళంలో బీజేపీ మద్దతు అభ్యర్థి వి.శాంతి ఒక్కో ఓటు తేడాతో గెలిచింది.ఐరాల మండలం వడ్రాంపల్లెలో వైసీపీ మద్దతు అభ్యర్థి ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు. విజయపురం మండలం కాళికాపురంలో వైసీపీ మద్దతు అభ్యర్థి మణి, బంగారుపాళ్యం మండలం ముంగరమడుగులో కుమారి ఎనిమిది ఓట్లతో విజయం సాధించింది.ఇక అత్తూరులో టీడీపీ మద్దతు అభ్యర్థి మాలరవేణి విజయభేరీ మోగించింది. ఏది ఏమైనా కూడా ఈ ఫలితాలు నిరాశకు గురి చేస్తున్నాయని అంటున్నారు. రెండో విడత లో ఏ పార్టీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
 



GHMC మేయ‌ర్ ఎన్నిక: ఎన్నిభాష‌ల్లో ప్ర‌మాణ స్వీకారం అంటే

లైగర్ రిలీజ్ డేట్ పోస్టర్.. విజయ్ డేరింగ్.. పూరీ మార్క్.. విజిల్స్ పక్కా..!

చంద్ర‌బాబు ఇంత ఫ్ర‌స్టేష‌న్‌లోనా... సిగ్గు వ‌దిలేసి మ‌రీ ?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఏకగ్రీవాల రికార్డు...?

షర్మిల పార్టీ ముహుర్తం ఇదే!

సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఏం.. నీ అయ్య సొమ్ముతో పంట కొంటున్నవా..? - రేవంత్‌ రెడ్డి ఫుల్ ఫైర్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>