PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-sec-nimmagadda-taken-against-ycp-mla-jogi-rameshad94daf5-576c-4d1e-8d51-14437a7bdd27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-sec-nimmagadda-taken-against-ycp-mla-jogi-rameshad94daf5-576c-4d1e-8d51-14437a7bdd27-415x250-IndiaHerald.jpgపారదర్శక ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తున్న ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది.nimmagadda rameshkumar;amala akkineni;editor mohan;hari;hari music;krishna river;jogi ramesh;andhra pradesh;district;media;panchayati;mla;evening;krishna district;letter;tdp;ycp;ammavodi;pedana;sv mohan reddy;reddy;partyనిమ్మగడ్డ మరో సంచలనంనిమ్మగడ్డ మరో సంచలనంnimmagadda rameshkumar;amala akkineni;editor mohan;hari;hari music;krishna river;jogi ramesh;andhra pradesh;district;media;panchayati;mla;evening;krishna district;letter;tdp;ycp;ammavodi;pedana;sv mohan reddy;reddy;partyThu, 11 Feb 2021 21:46:52 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రెండో దశ ఎన్నికల ప్రచార గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. ఇక పారదర్శక ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తున్న ఎస్ఈసీ
మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ కాకుండా వేరే పార్టీ వాళ్లు నామినేషన్లు వేస్తే.. ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామన్న జోగి రమేష్‌ వ్యాఖ్యలపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. జోగి రమేష్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని భావించిన ఎస్ఈసీ... ఆయనపై చర్యలకు ఆదేశించింది.  

            వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చుక్కల్లో పడ్డారు. వార్డు మెంబర్‎గా పోటీ‌చేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ’ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు‌ చేస్తున్నారని..అయినా..వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం జోగి అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.

   మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మిట్టపల్లి పంచాయతీలో అధికారులు, మీడియా సమక్షంలో ఉపసంహరించుకున్న ఇద్దరి నామినేషన్లను ఆమోదించాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. తుది జాబితాలో నామినేషన్లు ఉపసంహరించుకున్నవారి పేర్లు లేకుండా... జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలని ఎస్‌ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 


మరో సాయం చేసిన సోనూసూద్.. ఇలాంటివి కూడానా..?

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>