PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections3a3fd743-c022-45f9-9eb0-d2eb5bd19fba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections3a3fd743-c022-45f9-9eb0-d2eb5bd19fba-415x250-IndiaHerald.jpgవర్తమాన రాజకీయాలు అలా ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ చీమలు చేరడం సహజమైన పరిణామం. అందువల్ల మేమే గెలిచామని గొప్పలు చెప్పుకున్నా కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎందరు మిగులుతారో ఎవరికీ తెలియదు. jagan-nimmagadda-elections;cbn;geetanjali;telugu desam party;congress;district;telugu;chittoor;gold;chittor;panchayati;mandalam;tdp;local language;ycp;partyజగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?jagan-nimmagadda-elections;cbn;geetanjali;telugu desam party;congress;district;telugu;chittoor;gold;chittor;panchayati;mandalam;tdp;local language;ycp;partyThu, 11 Feb 2021 16:27:17 GMT
విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తొలి విడతలో వేయికి పైగా పంచాయతీలను గెలుచుకున్నామని, 38 శాతం ఓట్ల షేర్ వచ్చిందని ఢంకా భజాయించారు. మరో వైపు చూస్తే వైసీపీ నాయకులు తమ పార్టీ మొత్తానికి మొత్తం అంటే 90 శాతానికి పైగా సర్పంచులను గెలుచుకుందని ఫోటోలతో సహా అసలు నిజాలు బయటపెట్టి గట్టిగానే చెబుతామని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గెలిచిన వారు అంతా అధికార పార్టీకి చెందిన వారే అని ఎపుడో నాలుగు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు పారీ గుర్తులు ఉండవు, అందువల్ల వారు ఏ పార్టీలోనైనా చేరిపోవచ్చు. ఎవరూ దాన్ని ఫిరాయింపు అని కూడా అనేందుకు ఆస్కారం లేదు.

ఇక తొలి విడతలో ఫలితాలు  ఇలా వచ్చాయో లేదో కానీ చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ మద్దతుతో గెలిచిన కొందరు సర్పంచులు తెల్లారుతూనే వైసీపీ కండువా కప్పేసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని  బంగారుపాళ్యం మండలంలోని బొమ్మాయిపల్లెలో టీడీపీ మద్దతుతో గౌరమ్మ అనే అభ్యర్థి గెలిచారు. అయితే, రాత్రికి రాత్రే ఆమె పార్టీ మారారు. చిత్తూరు మండలంలోని చింతలకుంట పంచాయతీలో గెలిచిన గీతాంజలి కూడా వైసీపీలో చేరారు.  పూతలపట్టు మండలానికి చెందిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులూ వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

మరి సీన్ ఇలాగే ఉంటే ఏ పార్టీ మద్దతుతో  గెలిస్తేనేంటి. గెలిచిన వారంతా కూడా అధికార పార్టీకే జై కొడతారు కదా అన్నదే అర్ధమైపోతోంది.  ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాలి. 2013లో వైసీపీ కూడా బాగానే స్థానిక ఎన్నికల్లో గెలుచుకుంది. కానీ ఆ తరువాత టీడీపీ 2014లో అధికారంలోకి రావడంతో వారంతా అధికార పార్టీలోకి చేరిపోయారు. అసలు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ గుర్తుతో గెలిచి జంప్ జిలానీలు అవుతూంటే ఏ గుర్తూ లేని సర్పంచులు  మా పార్టీ అని చెప్పుకున్నా బాబు తో సహా ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా. ఏదో ఆత్మానందం తప్ప.
 


రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?

భూమిక చేసిన పనికి తలెత్తుకోలేకపోయా.. ఖుషి హీరోయిన్ పై రవిబాబు సంచలన వ్యాఖ్యలు..

జగడ్డ: పంచాయితీ ఎన్నికల్లో "నోటా" సంచలనం...ఫలితాలు రివర్స్...?

బ్రేకింగ్‌: GHMC మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి‌... ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>