PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-e4dc9b24-aec8-40b0-b47d-4090efc891ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-e4dc9b24-aec8-40b0-b47d-4090efc891ef-415x250-IndiaHerald.jpgప్రశాంత విశాఖ అశాంతి తో రగిలిపోతోంది. దానికి కారణం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడమే. విశాఖ ఉక్కుని నూటికి నూరు శాతం పరాయి వారికి అప్పగించి చేతులు దులుపుకునే కేంద్ర ఆలోచనల మీద ఉక్కు కార్మిక లోకం మండిపోతోంది.అదే సమయంలో రాజకీయ పార్టీలు చేస్తున్న రొచ్చు రాజకీయం తో విశాఖకు ఉక్కు పరిశ్రమ‌ దక్కుతుందా లేదా అన్న బెంగ కూడా కలుగుతోంది. jagan-;telugu desam party;korcha;jagan;telugu;vishakapatnam;chief minister;tdp;central government;ycp;partyఉక్కు సెగల విశాఖకు హఠాత్తుగా జగన్ ?ఉక్కు సెగల విశాఖకు హఠాత్తుగా జగన్ ?jagan-;telugu desam party;korcha;jagan;telugu;vishakapatnam;chief minister;tdp;central government;ycp;partyThu, 11 Feb 2021 17:24:08 GMTవిశాఖ అశాంతి తో రగిలిపోతోంది. దానికి కారణం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడమే. విశాఖ ఉక్కుని నూటికి నూరు శాతం పరాయి వారికి అప్పగించి చేతులు దులుపుకునే కేంద్ర ఆలోచనల మీద ఉక్కు కార్మిక లోకం మండిపోతోంది.అదే సమయంలో రాజకీయ పార్టీలు చేస్తున్న రొచ్చు రాజకీయం తో విశాఖకు  ఉక్కు పరిశ్రమ‌ దక్కుతుందా లేదా అన్న బెంగ కూడా కలుగుతోంది.

ఉక్కుని ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరుగుతోంది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే పోస్కో కంపెనీ ప్రతినిధులు జగన్ని కలిసి వెళ్లారని, జగన్ సైతం ప్రైవేటీకరణకు మొగ్గుతున్నారని నిందలు వేస్తున్నారు.

ఇక ఇంకో వైపు చంద్రబాబు సీఎం గా ఉండగానే విశాఖ ఉక్కుని పోస్కో కంపెనీకి ఇచ్చేందుకు రంగం సిధ్ధం అయిందని, నాడు చంద్రబాబు ఎందుకు ఊరుకున్నారని వైసీపీ నేతలు ఎదురుప్రశ్నిస్తున్నారు. ఇక అమరణ దీక్షలకు కూడా నేతలు రెడీ అవుతున్నారు. ఇక టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అమరణ దీక్షను చేపట్టారు. ఉక్కు కార్మిక సంఘాలు వారి భార్యాబిడ్డలతో సహా దీక్షలకు కూర్చుంటామని కూడా స్పష్టంగా చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ హఠాత్తుగా విశాఖ టూర్ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఈ నెల 17న విశాఖలో ఉన్న శ్రీ శారదాపీఠంలో జరిగే వార్షికోత్సవాలకు హాజరవుతున్నారు. అయితే విశాఖ అంతా వేడిగా ఉన్న వేళ ముఖ్యమంత్రి టూర్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది   ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా ఉక్కు సంఘాల ప్రతినిధులు సిద్ధపడుతున్న వేళ జగన్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పబోతున్నారు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అంతా ఒక్కటై గర్జిస్తున్న టైం లో సీఎం వారికి ఏ రకమైన హామీ ఇస్తారు అన్నది కూడా ఆసక్తిని కలిగించే అంశమే.






రైతులకు మద్దతిస్తూ యుట్యూబర్ బికినీ షూట్.!

జగడ్డ : బాబుకు షాకుల మీద షాకులు ?

'అలా రికార్డుల పురములో '.. బన్నీ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్..!!

రష్మిక 2 కోట్ల కల.. మీడియా వాళ్లు రాస్తున్నారు కాని..!

రవితేజ తన రూమ్ మేట్స్ తో కలిసి తీసిన సినిమా ఏంటో తెలుసా..?

జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిమెంట్.. చివర్లో ఊహించని ట్విస్ట్...?

సినిమా మొదటి రోజు హిట్ టాక్ అందుకొని,తరువాత ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>