PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ins-virat-40-percent-collapsed-and-restoration-impossible263980e8-705a-491f-95ad-e1b3ecfc151f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ins-virat-40-percent-collapsed-and-restoration-impossible263980e8-705a-491f-95ad-e1b3ecfc151f-415x250-IndiaHerald.jpgభారత నౌకాదళంలో 29 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ జీవితకాలం పూర్తవడంతో 2017 మార్చిలో దీన్ని ఉపసంహరించారు. ఈ నేపథ్యంలో వేలం నిర్వహించగా.. శ్రీరాం షిప్‌ బ్రేకర్స్‌ సంస్థ రూ.38.54 కోట్లకు దక్కించుకుంది. నౌక భాగాలను తొలిగించామని, దానిని పునరుద్ధరించడం అసంభవమని తెలిపింది. ‘మొత్తం 40 శాతానికిపైగా విచ్ఛిన్న ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపిందిins virat;hari;hari music;ram pothineni;sree raam;sriram;virat kohli;vishakapatnam;media;court;central government;sardar vallabhai patel;marchఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్న ప్రక్రియ 40 శాతం పూర్తి... పునరుద్ధరణ అసంభవం - శ్రీరామ్ గ్రూప్ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్న ప్రక్రియ 40 శాతం పూర్తి... పునరుద్ధరణ అసంభవం - శ్రీరామ్ గ్రూప్ins virat;hari;hari music;ram pothineni;sree raam;sriram;virat kohli;vishakapatnam;media;court;central government;sardar vallabhai patel;marchThu, 11 Feb 2021 22:05:00 GMTవిరాట్ ను తుక్కుగా మార్చేందుకు ఇప్పటికే ఒక కాంట్రాక్టు ద్వారా పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. అయితే తాజాగా ఈ విచ్ఛిన్న ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ చారిత్రక యుద్ధ నౌకను కొనుగోలు చేసి సముద్ర మ్యూజియంగా మార్చేందుకు ఎన్వీటెక్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. నౌక విచ్ఛిన్న ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే, ఇప్పటికే విరాట్ విచ్ఛిన ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందని, చాలా ఆలస్యమైందని ఈ నౌకను కొనుగోలు చేసిన శ్రీ రామ్ గ్రూప్ పేర్కొంది.



పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, నౌకను కొనుగోలు చేసిన మరో సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే 40 శాతం విచ్ఛిన్న ప్రక్రియ పూర్తయ్యిందని శ్రీరామ్ గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ పటేల్ అన్నారు. గతేడాది జులైలో జరిగిన వేలంలో శ్రీరామ్ గ్రూప్ రూ.38.54 కోట్లకు ఐఎన్ఎస్ విరాట్‌ను దక్కించుకుంది. అనంతరం గుజరాత్‌లోని అలంగ్ తీరానికి తరలించి, డిసెంబరు నుంచి తుక్కుగా మార్చే ప్రక్రియను ప్రారంభించింది. నౌక భాగాలను తొలిగించామని, దానిని పునరుద్ధరించడం అసంభవమని తెలిపింది. ‘మొత్తం 40 శాతానికిపైగా విచ్ఛిన్న ప్రక్రియ పూర్తయ్యింది.. మేము ఇప్పటికే ఓడను ఒడ్డుకు తీసుకొచ్చాం.. దానిలోని కొన్ని భాగాలను కూల్చివేశాం.. ఓడ ఇప్పుడు తేలుతూనే ఉండటం అసాధ్యం’ అని శ్రీరామ్ గ్రూప్ ఛైర్మన్ పేర్కొన్నారు. మీడియా ద్వారా సుప్రీంకోర్టు స్టే విషయం గురించి తెలిసినట్టు చెప్పారు. కోర్టు నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదు.. కానీ, ఓడను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మాకు నోటీసు అందిన తర్వాత న్యాయ బృందం సమాధానం ఇస్తుంది’ అని అన్నారు.



ఇక, భారత నౌకాదళంలో 29 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ జీవితకాలం పూర్తవడంతో 2017 మార్చిలో దీన్ని ఉపసంహరించారు. విశాఖ తీరంలో ఉన్న ఈ నౌకను తొలుత మ్యూజియంగా మార్చాలని నాటి ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తుక్కుగా మార్చి విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వేలం నిర్వహించగా.. శ్రీరాం షిప్‌ బ్రేకర్స్‌ సంస్థ రూ.38.54 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఈ నౌకను గుజరాత్‌లోని అలంగ్‌ తీరానికి తరలించి, కొంతభాగాన్ని నిర్వీర్యం చేశారు. అయితే ఈ యుద్ధనౌకను మ్యూజియంగా మార్చాలని భావిస్తున్న ఎన్విటెక్‌ అనే మరో సంస్థ నౌకను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. కానీ రక్షణశాఖ నుంచి నిరభ్యంతర పత్రం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


మరో సాయం చేసిన సోనూసూద్.. ఇలాంటివి కూడానా..?

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....

శ్రీముఖి, విష్ణు ప్రియాలని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>